Tuesday, April 30, 2024

పల్నాడు జిల్లా అభివృద్ధికి సహకరించండి.. శ్రీకృష్ణదేవరాయలు వినతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంగా ఉందని, పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నరసరావుపేట మున్సిపాలిటీలో రైల్వే అండర్ బ్రిడ్జిను నిర్మించాలని వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి జిల్లాలోని సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం నరసరావుపేట మున్సిపాలిటీ గ్రేడ్1 మున్సిపాలిటీ అని, ప్రస్తుతం జిల్లాగా మారడం వల్ల ట్రాఫిక్ సమస్యలు రెట్టింపు కానున్నాయని పేర్కొన్నారు. ఈ ఆర్‌యూబీ నిర్మాణంలో 50 శాతం వ్యయ భారాన్ని మున్సిపాలిటీ భరించేందుకు సిద్ధంగా ఉందని మంత్రికి వివరించారు. స్పెషల్ కేసుగా పరిగణించి ఆర్‌యూబీని మంజూరు చేసి త్వరితగతిన నిర్మించాలని కోరారు.

అలాగే పల్నాడు ప్రాంతంలో ప్రధాన స్టేషన్లుగా ఉన్న పిడుగురాళ్ల, నడికుడి రైల్వే స్టేషన్లలో కరోనాకు ముందులా రైళ్లు ఆగేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. నిత్యం ఈ స్టేషన్ల నుంచి పెద్దసంఖ్యలో ప్రయాణికులకు రాకపోకలు సాగిస్తుంటారని, ప్రస్తుతం రైళ్లు ఆగకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని శ్రీకృష్ణ కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నడికుడి స్టేషన్‌ను ఈ ఏడాది ‘ ఆదర్శ్ స్టేషన్’ పథకం కింద త్వరగా అప్ గ్రేడ్ చేసి ఆధునికీకరించాలని విజ్ఞప్తి చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement