Monday, April 29, 2024

రిజ‌ర్వాయ‌ర్ ల‌కు కొన‌సాగున్న వ‌ర‌ద‌.. భారీగా వ‌చ్చి చేరుతున్న ఇన్ఫ్లో

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కు వరద కొనసాగుతోంది. 16 క్రస్ట్ గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 2.40 లక్షల క్యూసెక్కులు కాగా.. ఔట్ఫ్లో 2.81 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 588.70 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ సామర్ధ్యం 312.0405 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 308.1702 టీఎంసీలకు చేరుకుంది.

శ్రీశైలం జ‌లాశ‌యానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. ప్ర‌స్తుతం జ‌లాశ‌యం నుంచి ఇన్ ఫ్లో 3.20.000 క్యూ సెక్కులు, ఔట్ ఫ్లో 3.51.332 క్యూ సెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 885 అడుగులు కాగా, ప్ర‌స్తుతం నీటి నిల్వ 884.60 అడుగులుగా ఉంది. జ‌లాశ‌యం పూర్తి స్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుత సామర్థ్యం 214.80 టీఎంసీలు గా ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement