Monday, March 25, 2024

అన్ని ఫార్మట్‌లకు గుడ్ బై.. రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్‌ రేచల్‌ హేన్స్‌

ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్‌ రేచల్‌ హేన్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని ఫార్మట్లకు రిటైర్‌మెంట్‌ ప్రకటించింది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్‌ చీఫ్‌ నిక్‌ హక్‌లీ తెలిపారు. ” ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్‌ రేచల్‌ హేన్స్‌ సేవలు ఆస్ట్రేలియా కోల్పోనుంది. దాదాపు దశాబ్దానికి పైగా క్రికెట్‌లో సేవలందించిన ఆమె ఇవాళ ఆటకు వీడ్కోలు పలకడం దురదృష్టకరం. ఇన్నేళ్లలో ఆమె జట్టు తరపున ఎన్నో విజయాల్లో భాగస్వామ్యమైంది. రేచల్‌ హేన్స్‌ ఆడిన కాలంలో ఆస్ట్రేలియా ఆరు మేజర్‌ టోర్నీలు గెలవడం ఆమెకు గర్వకారణం. ఇకపై తన ప్రయాణం సాఫీగా సాగిపోవాలని కోరుకుంటున్నాం” అని అన్నాడు.

కాగా రేచల్‌ ఆస్ట్రేలియా తరపున 6 టెస్టుల్లో 383 పరుగులు, 77 వన్డేల్లో 2585 పరుగులు, 84 టీ 20 ల్లో 850 పరుగులు చేసింది. హేన్స్‌ ఖాతాలో రెండు వన్డే సెంచరీలు ఉన్నాయి. కాగా టెస్టుల్లో అరంగేట్రం ఇచ్చిన డెబ్యూ మ్యాచ్‌లోనే హేన్స్‌ 98 పరుగులు చేసి ఆకట్టుకుంది. ఇక హేన్స్‌ చివరగా బర్మింగ్‌ హామ్‌ వేదికగా జరిగిన కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో టీమ్‌ ఇండియాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఆడింది. ఈ మ్యాచ్‌ గెలిచిన ఆస్ట్రేలియా స్వర్ణ పతకం గెలుచుకుంది. ఇక హేన్స్‌ పలు సందర్బాల్లో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. 2017 వన్డే వరల్డ్‌ కప్‌లో ఒక మ్యాచ్‌లో జట్టు కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ భుజం గాయంతో పక్కకు తప్పుకోవడం వల్ల నాయకత్వ బాధ్యతలు నిర్వహించింది. ఆ తర్వాత 2018లో తొలిసారి వైస్‌ కెప్టెన్‌ అయిన రేచల్‌ హేన్స్‌ 2020లో టీ 20 వరల్డ్‌ కప్‌ , 2022లో వన్డే వరల్డ్‌కప్‌ను గెలవడంలో కామన్‌ వెల్త్‌ గేమ్స్‌లో ఆస్ట్రేలియా స్వర్ణం గెలవడంలోనూ కీలక పాత్ర పోషించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement