Monday, April 29, 2024

డేటా ప్రొటెక్షన్ బిల్లుపై సంప్రదింపులు జరుగుతున్నాయి.. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు-2022’ పేరుతో ఒక ముసాయిదా బిల్లును రూపొందించిందని, ప్రస్తుతం ఈ ముసాయిదా బిల్లు సంప్రదింపుల దశలో ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. శుక్రవారం రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ డేటా ప్రొటెక్షన్‌ బిల్లులో వినియోగదారుల హక్కులు, విధులు, వారి వ్యక్తిగత సమాచార భద్రత, ఫిర్యాదు విధానం వంటి అంశాలను పొందుపరిచినట్లు మంత్రి తెలిపారు.

గూగుల్ ద్వారా వినియోగదారుని లొకేషన్ అక్రమంగా ట్రాకింగ్ చేస్తున్న విషయం మీ దృష్టికి వచ్చిందా? దీనిని అరికట్టేందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? అన్న ప్రశ్నకు మంత్రి బదులిస్తూ ఇతర దేశాల్లో గూగుల్ ద్వారా వినియోగదారుల లొకేషన్ అక్రమంగా ట్రాకింగ్ చేస్తున్నట్లు మీడియా కథనాల ద్వారా తమ దృష్టికి వచ్చింది. అయితే అటువంటి సంఘటనలు మన దేశంలో జరిగినట్లు ఎటువంటి ఫిర్యాదులు తమ దృష్టికి రాలేదని మంత్రి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement