Monday, April 29, 2024

భ‌య‌పెడుతోన్న.. న‌య‌న‌తార క‌నెక్ట్ మూవీ టీజ‌ర్

అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం క‌నెక్ట్. స్టార్ హీరోయిన్ నయనతార న‌టించిన మరో హారర్ థ్రిల్లర్ సినిమా . ఈ సినిమా నుంచి తెలుగు వెర్షన్ కి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు. ఆత్మలను పిలిచి మాట్లాడటం అనే ఒక కాన్సెప్ట్ తో రూపొందిన సినిమా ఇది. అలా హీరోయిన్ ఒక ఆత్మను పిలిస్తే మరో ఆత్మ వస్తుంది. ఆ తరువాత నుంచి చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి అనేదే కథ. టీజర్ తరువాత సినిమాపై ఆసక్తి పెరగడం ఖాయమనే అనిపిస్తోంది.ఈ సినిమాలో, అనుపమ్ ఖేర్ .. సత్యరాజ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను ఈ నెల 22వ తేదీన విడుదల చేయనున్నారు.నయనతార సొంత బ్యానర్ లో నిర్మితమైన ఈ సినిమాను, ఇక్కడ యూవీ క్రియేషన్స్ వారు రిలీజ్ చేస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement