Tuesday, April 30, 2024

విద్యుత్ కోతల పై కాంగ్రెస్ నిరసన..

రాష్ట్రంలో కోత‌లు లేకుండా విద్యుత్ అందిస్తున్నామ‌ని చెప్పుకుంటున్న తెలంగాణ స‌ర్కార్ పై కాంగ్రెస్ నాయ‌కులు మండిప‌డ్డారు. రాష్ట్రంలో విద్యుత్ కోతల పై కాంగ్రెస్ నాయ‌కులు నిరసన వ్య‌క్తం చేసింది. అసెంబ్లీ సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. స్పీకర్ వాయిదా తీర్మానం తిరస్కరించడంతో కాంగ్రెస్ నాయ‌కులు ఆందోళ‌న‌కు దిగారు. సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే లు శ్రీధరబాబు, సీతక్క, తూర్పు జగ్గారెడ్డి ప్లకార్డులతో నిరసన తెలిపారు. క‌రెంట్ కోత‌ల‌తో రైతులు క‌ష్టాలు ప‌డుతున్నార‌న్నారు. రైతుల‌కు 24 గంట‌లు త్రీ ఫేజ్ క‌రెంట్ స‌ర‌ఫ‌రా చేయాల‌ని వారు డిమాండ్ చేశారు. రైతు ప్ర‌భుత్వం అని మాట‌ల్లో చెప్పుకోవ‌డ‌మే త‌ప్పా చేత‌ల్లో రైతు వ్య‌తిరేక ప్ర‌భుత్వం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement