Friday, April 26, 2024

వడ్డీరేట్లపై బీజేపీని టార్గెట్ చేసిన కాంగ్రెస్

చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను భారీగా తగ్గిస్తూ బుధవారం ప్రకటన విడుదల చేసిన కేంద్రం, విమర్శలు రావడంతో గురువారం ఉదయం ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. కొన్ని గంటల వ్యవధిలోనే కేంద్రం వెనకడుగు వేయడంపై కాంగ్రెస్ సెటైర్లు వేసింది. కోట్ల మంది ఖాతాలపై ప్రభావం చూపే నిర్ణయాలపై పొరపాటు ఎలా జరగిందని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ సూటిగా ప్రశ్నించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆ పదవిలో కొనసాగే నైతికత లేదని మండిపడ్డారు.

తొలుత ఉత్తర్వులను జారీ చేసి ఆపై పొరపాటు చేశామని, దిద్దుబాటు చర్యగా నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నామని, పాత వడ్డీ రేట్లే కొనసాగుతాయని నిర్మలా సీతారామన్ ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసిన ప్రియాంకా గాంధీ, దీని వెనుక బీజేపీ ఎన్నికల దూరదృష్టి దాగుందని, ఇది ఓ జిమ్మిక్కు అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా సైతం బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏమైనా సర్కస్ నడుపుతున్నారా అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement