Saturday, May 4, 2024

ప్రజలను తికమక పెడుతూ జగన్, కేసీఆర్ నాటకాలు: సుంకర పద్మశ్రీ

ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న జలజగడంపై కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ విమర్శలు చేశారు. ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ జగన్, కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని ఆమె ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టడానికి రాష్ట్ర ప్రయోజనాలు కోసం రగడ జరుగుతున్నట్లు నటిస్తున్నారని ఆరోపించారు. ఒక అసమర్ధ ముఖ్యమంత్రి వలనే నేడు రాష్ట్రం ఈ పరిస్థితికి వచ్చిందన్నారు. సీఎం చేతకాని తనం వలనే నేడు అమరావతికి ఈ గతి పట్టిందని వ్యాఖ్యానించారు.

నీటి పంపకాలపై ఏపీ, తెలంగాణ మధ్య రగడ వస్తుందని అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రయోజనాలు కోసం నిరంతరం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఏపీని కేంద్ర ప్రభుత్వం గాలికి వదిలిసిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం వలన పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిపోయాయని సుంకర్ అన్నారు. సొంత ప్రయోజనాలు కోసం సీఎం జగన్ కేంద్రం దగ్గర మోకారిల్లాడని దుయ్యబట్టారు. ప్రధాన ప్రతిపక్షం అధికార పార్టీని ప్రశ్నించకుండా జోద్యం చూస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి ధరలను అదుపులోకి తీసుకువచ్చే వరకు పోరాటం చేస్తామని సుంకర పద్మశ్రీ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై కేంద్రానికి సీఎం జగన్ మరో లేఖ

Advertisement

తాజా వార్తలు

Advertisement