Thursday, May 16, 2024

Congress Confident – తెలంగాణతో సహా నాలుగు రాష్ట్రాల్లో విజయం మాదే… రాహుల్ గాంధీ

పాట్నా . . త్వరలో జరిగే తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని, బీజేపీ ఎక్కడా కనిపించదని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. పాట్నాలో విపక్షాల సమావేశానికి ముందు కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ, బీజేపీకి ‘భారత్ తోడో’ సిద్ధాంతం ఉందని ఆరోపించారు. భారత్ జోడో యాత్రలో తాను ఎక్కడికి వెళ్లినా, తాను బీహార్ ప్రజలను కలిశానన్నారు. వారందరూ మా భావజాలాన్ని విశ్వసించడం, దానిని లోతుగా అర్థం చేసుకుని తమతో చేరారని రాహుల్ తెలిపారు. దేశంలో బీజేపీ ద్వేషాన్ని, హింసను వ్యాపిస్తోందని, దీన్ని కాంగ్రెస్‌ ప్రేమతో ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తోందని రాహుల్‌ అన్నారు.. వచ్చే ఎన్నికలలో విపక్షాలు కలిసి కట్టుగా పోటీ చేస్తాయని ప్రకటించారు. బీహార్ లో విజయం సాధిస్తే దేశం మొత్తం విజయం సాధించి నట్లేనని అన్నారు

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి విపక్షం అవసరాన్ని ఖర్గే ప్రస్తావించారు. కాంగ్రెస్ సిద్ధాంతాలను బీహార్ నుండి ఎప్పటికీ విడదీయలేమని ఖర్గే తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష నేతలను ఏకతాటిపైకి తీసుకురావడంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషించారని ఖర్గే గుర్తుచేశారు.

మరోవైపు ఢిల్లీలో పెత్తనం కోసం కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా తమకు మద్దతివ్వకపోతే విపక్షాల భేటీకి రాలేమంటూ నిన్న కేజ్రివాల్ చేసిన హెచ్చరికలపై స్పందించిన మల్లిఖార్జున ఖర్గే .. దీనిపై పార్లమెంట్ సమావేశాలకు ముందే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పుడు దానిపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం లేదన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement