Monday, April 29, 2024

Big Story | నాలుగేళ్ల డిగ్రీ కోర్సుపై అయోమయం.. సీట్ల భర్తీపై అనుమానాలు

అమరావతి,ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి అన్ని కాలేజీల్లోనూ నాలుగేళ్ల డిగ్రీ కోర్సును రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రవేవపెట్టింది. నూతన విద్యా విధానంలో భాగంగా యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు ఈ నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టారు. విద్యార్ధులను బహుముఖ ంగా తీర్చిదిద్దడం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారిలో నైపుణ్యాన్ని పెంచండం ఈ నాలుగేళ్ల డిగ్రీ కోర్సు యొక్క లక్ష్యం. కోర్సు నిర్మాణం కూడా పూర్తిగా మారనుంది. గతంలో డిగ్రీలో మూడు సజ్జె క్టులను తీసుకునేవారు. అంటే లెక్కలు, ఫిజిక్స్‌, కె మిస్ట్రీ తీసుకునేవారు. ఈ మూడు కూడా మేజర్‌ సబ్జెక్ట్‌లుగానే ఉండేవి. కానీ కొత్త విధానంలో ఒక సబ్జెక్ట్‌ను మాత్రమే మేజర్‌గా తీసుకోవాలి.

మైనర్‌గా మరో సబ్జెక్ట్‌ను ఇష్టమొచ్చింది తీసుకోవచ్చు. ఒకరు లెక్కలు మేజర్‌గా తీసుకుంటే మైనర్‌ కింద ఏ హిస్టరీనో, ఏ మ్యూజిక్‌నో తీసుకోవచ్చు. లేదా కెమిస్ట్రీ , ఫిజిక్స్‌లలో ఏదో ఒకటి తీసుకోవచ్చు. గత డిగ్రీ కోర్సులో ఒక్కొ ఏడాదికి ఆ పేపర్‌లో పాసయ్యారా లేదా అనేది మాత్రమే చూసేవారు. ఇప్పుడు కొత్తగా క్రెడిట్స్‌ సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. నాలుగేళ్ల డిగ్రీ కోర్సు సెమిస్టర్‌ సిస్టమ్‌లో కొనసాగుతుంది. ఒక్కొ సెమిస్టర్‌కు 20 క్రెడిట్స్‌ను కేటాయిస్తారు. మొత్తంగా చూసినప్పుడు ఐదు విభాగాలుగా నాలుగేళ్ల కోర్సు నిర్మాణం ఉంటుంది. మొదటి ఏడాది యూనివర్శిటీ కోర్‌ కోర్సులు ఉంటాయి. వీటికి 20 క్రెడిట్‌లు ఇచ్చారు. ప్రతి విద్యార్ధి ఈ కోర్‌ కోర్సులు మొదటి సంవత్సరంలో చదవాల్సిందే.

- Advertisement -

రెండో సెమిస్టర్‌ నుండి విద్యార్ది ఎంచుకున్న మేజర్‌ సబ్జె క్ట్‌ను చదవాల్సి ఉంటుంది. రెండో సెమిస్టర్‌ నుండి ఎనిమిదో సెమిస్టర్‌ వరకు ఈ మేజర్‌ సబ్జెక్ట్‌ ను విద్యార్ధి చదవాల్సి ఉంటుంది. ఒక ఒక్క సబ్జెక్ట్‌కే 60 క్రెడిట్స్‌ కేటాయించారు. ఇందులో కోర్‌ తోపాటు ఎలక్టివ్‌ కూడా కలిపి ఉంటాయి. ఒక మైనర్‌ సబ్జెక్ట్‌కు 24 క్రెడిట్స్‌ కేటాయించారు. ఇక మల్టి డిసి ప్లీనరీ కోర్సులు ఉంటాయి. ఆ కాలేజీలో ఉన్న వివిధ కోర్సుల్లోంచి ఏదైనా సబ్జెక్ట్‌ను ఎంచుకొని చదవవచ్చు. ఈ కేటగిరీకి 12 క్రెడిట్స్‌ కేటాయించారు. ఈ కాకుండా చివర్లో ఇంటర్నషిప్‌ ఉంటుంది. దీనికి నాలుగు క్రెడిట్స్‌ కేటాయించారు. ఐదు విభాగాలుగా నాలుగేళ్ల డిగ్రీ కోర్సును యూజిసి పకడ్బందీగా నిర్మాణం చేసింది. కానీ రాష్ట్రంలో దీని అమలుతీరుపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

నాలుగేళ్ల డిగ్రీ కోర్సుపై అవగాహన ఏదీ?

ఓ కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టేప్పుడు దానిపై విద్యార్ధులు, అధ్యాపకులతోపాటు ఆ రంగంలో ఉన్న అందరికీ అవగాహన కల్పించాల్సి ఉంది. నూతన విద్యా విధానంలో భాగంగా నాలుగేళ్ల డిగ్రీ కోర్సును పకడ్బందీగా రూపొందించినప్పటికీ కొంత అర్ధం చేసుకోవడానికి క్లిష్ట తరంగా కూడా ఉంది. క్రెడిట్స్‌ విధానం ఏంటి, మేజర్‌ ఏంటీ, మైనర్‌ ఏంటీ, ఏదీ మేజర్‌గా తీసుకుంటే ఎటువంటి అవకాశాలు వస్తాయి అనేది అడ్మిషన్లు ప్రారంభమయ్యే నాటికే విద్యార్ధులకు అవగాహన కల్పించాలి. కానీ ఈ విద్యా సంవత్సరం నుండి నాలుగేళ్ల డిగ్రీ కోర్సు అమలు చేస్తున్నప్పటికీ పై విషయాలపై విద్యార్ధులకు ఎటువంటి అవగాహన లేదు. ఇంటర్‌ పరీక్షలు అవగానే ప్రాంతాల వారీగా సదస్సులు పెట్టి విద్యార్దుల్లో అవగాహన పెంచుతామని ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.

కానీ అది జరగలేదు. తీరా అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ ఇచ్చిన తర్వాత అరకొరగా అవగాహన సదస్సులు జరుగుతున్నాయి. వీటి వల్ల పెద్దగా ఉపయోగం లేదు. గత ఏడాది అగస్టులో అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ ఇవ్వగా ఈ ఏడాది జూన్‌లోనే నోటిఫికేషన్‌ ఇచ్చారు. జులై మూడు కల్లా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. కానీ విద్యార్ధుల్లో పెద్ద గందరగోళం నెలకొంది. నాలుగేళ్ల డిగ్రీ కోర్సు చేసే బదులు ఇంజనీరింగ్‌నే చదువుకోవచ్చు కదా అని చాలా మంది భావిస్తున్నారు. అవగాహనా లోపంతో ఈ ఏడాది డిగ్రీ కోర్సుల్లో చేరే వారి సంఖ్య తగ్గే అవకాశముందని ప్రయివేట్‌ డిగ్రీ కాలేజీల యజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సరైన సమయంలో సరైన విధంగా విద్యార్ధుల్లో అవగాహన కల్పించడం జరగలేదని, దీని వల్ల డిగ్రీ కోర్సుల్లో చేరే వారి సంఖ్య తగ్గే అవకాశముందని ప్రవేయిట్‌ కాలేజీ యాజమన్యాల అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.గుండారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రతి యూనివర్శిటీ వాటి పరిధిలో ఉన్న విద్యార్ధులకు పెద్ద ఎత్తున అవగాహాన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

కనపడని ఎన్‌ఇపి స్ఫూర్తి

నూతన విద్యా విధానం ప్రకారం నాలుగేళ్ల డిగ్రీ కోర్సులో ఏ విద్యార్ధి అయినా తన ఇష్టం వచ్చిన మేజర్‌ను ఎంచుకోవచ్చు. మైనర్‌గా ఏదైనా సబ్జెక్ట్‌ను, మల్టి డిసిప్లినరీలో తన అభిరుచికి తగిన అంశాలను ఎంచుకోవచ్చు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ప్రయివేట్‌ కాలేజీల్లో కొంతమేరుకు అధికంగా మేజర్‌ సబ్జెక్ట్‌ లు ఉన్నాయి. అవి కూడా నూతన విద్యా విధానం పేర్కొన్నట్లు విస్తృత స్తాయిలో లేవు. ఇక ప్రభుత్వ డి గ్రీ కాలేజీల్లో అయితే చాలా చోట్ల కీలకమైన ఎకనామిక్స్‌, మాథమేటిక్స్‌ మేజర్లు లేనే లేవు. ఇక మైనర్‌ విషయానికి వస్తే విద్యార్ధికి ఇష్టమొచ్చిన మైనర్‌ను ఎంచుకునే అవకాశం లేదు. కాలేజీ యాజమాన్యమే ముందుగానే ఈ మేజర్‌ తీసుకుంటే ఈ మైనర్‌ మాత్రమే తీసుకోవాలని నిర్ధేశిస్తోంది. మొత్తంగా చూస్తే నాలుగేళ్ల డిగ్రీ కోర్సు ప్రారంభ సంవత్సరం ముళ్ల మీడ నడకలాగే ఉండబోతోంది. నూతన విద్యా విధానం ఏ స్పూర్తినయితే అందించాలని కోరుకుందో నాలుగేళ్ల డిగ్రీ కోర్సులో మాత్రం అది నెరవేరడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement