Sunday, April 28, 2024

ఆగస్టు 16 నుంచి కాలేజీలు ప్రారంభం..

ఉత్తరప్రదేశ్ లో ఈ నెల 16 నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరిచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 16వ తేదీ నుంచి 12వ త‌ర‌గ‌తి క్లాసుల‌ను తెరిచేందుకు అనుమతినిచ్చిన ప్రభుత్వం..వచ్చే నెల ఒకటొ తేది నుంచి కాలేజీలు, యూనివర్సిటీలను తెరవనున్నట్లు తెలిపింది. ఇంట‌ర్ కాలేజీల‌ను 50 శాతం కెపాసిటీతో ఓపెన్ చేసేందుకు ప‌ర్మిష‌న్ ఇచ్చారు. కాలేజీలు, వ‌ర్సిటీల్లో ఆగ‌స్టు 5వ తేదీ నుంచి విద్యార్థుల ప్ర‌వేశ ప్ర‌క్రియ మొద‌లుపెట్టే విధంగా ఆదేశాలు ఇచ్చారు. కోవిడ్ వ‌ల్ల రాష్ట్ర‌వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు బంద్ అయిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే హిమాచ‌ల్‌, పంజాబ్‌, చ‌త్తీస్‌ఘ‌డ్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల్లో ఇంట‌ర్ కాలేజీల‌ను ఓపెన్ చేశారు.

ఇది కూడా చదవండి: హుజురాబాద్ టికెట్ రెడ్డి వర్గానికా? బీసీలకా ?

Advertisement

తాజా వార్తలు

Advertisement