Sunday, April 28, 2024

చక్ దే ఇండియా: గోల్డ్ తీసుకురండి చాలు..

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన చక్ దే ఇండియా మూవీ అప్పట్లో సెన్సెషన్ సృష్టించిన సంగతి తెలిసిందే.. మహిళల హాకీ ఇతివృత్తంతోనే తెరకెక్కిన ఈ మూవీలో షారుక్ ఖాన్ కోచ్ పాత్రలో నటించాడు. అయితే తాజాగా టోక్యో ఒలింపిక్స్ లో ఇండియ‌న్ వుమెన్స్ హాకీ టీమ్ అదరగొడుతోంది. పటిష్ఠమైన ఆస్ట్రేలియాను చిత్తు చేసి సమీఫైనల్లో అడుగుపెట్టింది. అయితే ఈ చారిత్ర‌క సంద‌ర్భాన్ని రియ‌ల్ లైఫ్ చ‌క్ దే ఇండియాతో పోల్చాడు కోచ్ సోయెర్డ్‌ మ‌రీన్‌. ఆ మూవీ కూడా మ‌హిళ‌ల హాకీ ఇతివృత్తంతోనే తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే. ఇప్పుడా మూవీలో కోచ్ పాత్ర పోషించిన బాలీవుడ్ బాద్ షా షారుక్‌ఖాన్ ఈ విజ‌యంపై స్పందించాడు. కోచ్ సోయెర్డ్‌ చేసిన ట్వీట్‌పై కింగ్ ఖాన్ రియాక్ట‌య్యాడు. సారీ ఫ్యామిలీ.. నేను రావ‌డం లేట‌వుతుంది అని కోచ్ ట్వీట్ చేశాడు. మూవీలో కోచ్ క‌బీర్‌ఖాన్ పాత్ర పోషించిన షారుక్ దీనికి స్పందిస్తూ.. స‌రే ఏం ప్రాబ్లం లేదు. మీరు వ‌చ్చేట‌ప్పుడు 100 కోట్ల మంది ఉన్న కుటుంబానికి గోల్డ్ తీసుకురండి చాలు. మీ ఎక్స్ కోచ్ క‌బీర్ ఖాన్ అని రిప్లై ఇచ్చాడు.

ఇది కూడా చదవండి: పీవీ సింధు కులం ఏంటి?.. గూగుల్ లో టాప్ సెర్చ్ !
Advertisement

తాజా వార్తలు

Advertisement