Thursday, May 2, 2024

పీవీ సింధు కులం ఏంటి?.. గూగుల్ లో టాప్ సెర్చ్ !

టోక్యో ఒలింపిక్స్ లో సత్తా చాటిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు సంబంధించిన వివరాల కోసం గూగుల్ లో అత్యధిక మంది వెతికారు. ఇదే సమయంలో మరో ఆశ్చర్యకరమైన సంగతి వెల్లడైంది. బంగారు పతకం కోసం సింధు పోటీ పడిన సందర్భంలో.. గతంలో సాధించిన విజయాల గురించి కాకుండా ఆమె కులం ఏమిటో తెలుసుకునేందుకు కొంత మంది ప్రయత్నించారు. గూగుల్ సెర్చ్ లో ఆమె కులం కోసం వెతికారు. గూగుల్ సెర్చ్ బాక్స్ లో సింధు కోసం శోధించిన వాటిలో ఆమె కులం మోస్ట్ సెర్చెడ్ కీవర్డ్ గా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది సింధు వివరాల కోసం గూగుల్ లో వెతికారు. పీవీ సింధు కాస్ట్ పేరుతో ఎక్కువ మంది శోధించారు. గతంలోనూ పీవీ సింధు రజత పతకం సాధించిన సందర్భంగా ఆమె కాస్ట్ ను గూగుల్ లో సెర్చ చేశారు. పీవీ సింధు, పీవీ సింధు విన్స్, పీవీ సింధు కాస్ట్ వెతికారు.

కాగా, చిన్న వయస్సులో ఒలింపిక్స్ లో పతకం సాధించిన భారత క్రీడాకారణిగా పీవీ సింధు ఘనతెక్కింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆదివారం కాంస్య పతకం గెలుపొందింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా చైనాకి చెందిన హి బింగ్జియావోతో తలపడిన పీవీ సింధు 21-13, 21-15 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుపొందిన పీవీ సింధు.. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకం సాధించిన షట్లర్‌గా రికార్డ్ నెలకొల్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement