Monday, April 29, 2024

కుప్పకూలిన మార్కెట్లు, టాప్‌10 కంపెనీల్లో 4కంపెనీల లక్ష కోట్ల ఆవిరి..

గతవారం సెన్సెక్స్‌ సెన్సెక్స్‌ 170.49పాయింట్లు, నిఫ్టీ 113.90పాయింట్లు పతనమైంది. ఐటీ దిగ్గజాలు టీసీఎస్‌, ఇన్‌ఫోసిస్‌ వెనుకపడ్డాయి. టాప్‌-10 సంస్థల్లో నాలుగు కంపెనీల సంయుక్త మార్కెట్‌ విలువ రూ.1,05,848.14కోట్లు పడిపోయింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ మార్కెట్‌ విలువ క్షీణించగా హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్‌ రూ.51,628.12కోట్లు లాభపడ్డాయి. నాలుగు సంస్థల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) అత్యధికంగా రూ.40,640.76కోట్లు క్షీణించి 13,49,037.36కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ (ఎం-క్యాప్‌), రూ.36,703కోట్లు తగ్గి రూ.7,63,565కోట్లకు చేరుకుంది. రిలయన్స్‌ ఇండస్ట్రిస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) మార్కెట్‌ విలువ రూ.25,503.68కోట్లు తగ్గి రూ.17,70,205.42కోట్లుకు చేరగా, బజాజ్‌ ఫైనాన్స్‌ రూ.2,999,9కోట్లు తగ్గి రూ.4,45,810.84కోట్లకు చేరుకుంది.

వీటికి భిన్నంగా హిందుస్థాన్‌ యూనిలివర్‌ లిమిటెడ్‌ (హెచ్‌యుల్‌) ఎంక్యాప్‌ రూ.24,048.06కోట్లు నుంచి రూ.5,12,857.03కోట్లుకు, ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.12,403.56 కోట్ల నుంచి 5,24,180.57కోట్లకు ఎగబాకింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) 7,050.44కోట్ల రూపాయలను జోడించి దాని విలువను రూ.4,60,599.20కోట్ల రూపాయలకు పెంచుకుంది. కాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వాల్యుయేషన్‌ రూ.4,880.07కోట్లు పెరిగి రూ.8,40,294.91కోట్లకు చేరుకుంది. భారతీ ఎయిర్‌టెల్‌ మార్కెట్‌ విలువ రూ.1,949.67కోట్లు పెరిగి రూ.4,18,574.86కోట్లకు చేరుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్‌ విలు రూ.1,296.32కోట్లు పెరిగి రూ.4,45,659.60కోట్లకు చేరుకుంది. టాప్‌-10 సంస్థల ర్యాంకింగ్స్‌లో రిల్‌ తన అగ్రస్థానం నిలుపుకోగా టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌ఐసీ, ఎయిర్‌టెల్‌ తర్వాత స్థానాల్లో నిలిచాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement