Sunday, December 10, 2023

CM JAGAN : సీఎం జ‌గ‌న్ సూళ్లురుపేట ప‌ర్య‌ట‌న వాయిదా

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూళ్లూరుపేట పర్యటన వాయిదా పడింది. ఈ రోజు జరగాల్సిన సీఎం పర్యటన వాయిదా పడినట్లు సీఎంవో కార్యాలయం ప్రకటించింది.

- Advertisement -
   

మంగళవారం ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా రాయదరువు వద్దగల మాంబట్టు ఎస్‌ఈజెడ్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణం వద్ద నుంచే సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాల్సింది ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా కార్యక్రమాన్ని అధికారులు వాయిదా వేశారు. త్వరలోనే రీ షెడ్యూల్‌ ప్రకటించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement