Tuesday, October 8, 2024

దుల్క‌ర్ కొత్త సినిమాకి క్లాప్.. సీతా రామం త‌రువాత మ‌రో తెలుగు మూవీ

మాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోల‌లో దుల్కర్ సల్మాన్ ఒక‌రు. సీతా రామం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దుల్క‌ర్ పాన్ ఇండియ‌న్ రేంజ్ లో మ‌రింత ఫ్యాన్ బేస్ ని పెంచుకున్నారు. కాగా, తాజాగా తెలుగు డైరెక్ట‌ర్ అయిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ బాస్కర్ అనే అప్ క‌మింగ్ మూవీలో క‌నిపించ‌నున్నాడు. కొన్ని వారాల క్రితం ఈ మూవీ ఎనౌన్స్ మెంట్ తోనే అంద‌రి దృష్టిని ఆకర్షించింది.. కాగా, ఈ రోజు పూజా వేడుకతో షూటింగ్ ప్రారంభమైంది.

మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హారోయిన్ గా న‌టించ‌నుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కాగా, మొదటి షెడ్యూల్ 15 రోజుల పాటు జరగనుంది. రెండో షెడ్యూల్ ఫారిన్ లొకేషన్‌లో జరగనున్న‌ట్టు స‌మాచారం.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమా బ్యాన‌ర్ల‌పై తెర‌కెక్కుతుంది ఈ మూవీ. తారాగణం, సిబ్బంది గురించి మరిన్ని వివరాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించనున్నారు. అయితే మూవీకి జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement