Sunday, April 28, 2024

Skill Case – ముగిసిన చంద్ర‌బాబు సిఐడి క‌స్ట‌డీ విచార‌ణ

రాజమండ్రి: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు రెండు రోజుల సీఐడీ కస్టడీ ఆదివారంనాడు సాయంత్రంతో ముగిసింది.ఈ నెల 22వ తేదీన ఏపీ సీఐడీ కస్టడీకి రెండు రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది ఏసీబీ కోర్టు. దీంతో ఈ నెల 23, 24 తేదీల్లో సీఐడీ అధికారులు ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును విచారించారు. ఈ నెల 23న ఏడు గంటల పాటు చంద్రబాబును విచారించారు. ఇవాళ ఉదయం నుండి సాయంత్రం వరకు బాబు విచారించారు. శనివారం నాడు ఏడు గంటల పాటు 50 ప్రశ్నలు అడిగారు. ఇవాళ మరో 70 ప్రశ్నలు అడిగినట్టుగా సమాచారం. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సీఐడీ అధికారులు తాము సేకరించిన డాక్యుమెంట్ల ఆధారంగా చంద్రబాబును రెండు రోజుల పాటు సమాచారం సేకరించారు. షెల్ కంపెనీలకు నిధుల విషయమై కూడ సీఐడీ అధికారులు చంద్రబాబును ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది.

సీఐడీ డీఎస్పీ ధనుంజయ్ ఆధ్వర్యంలో సీఐడీ అధికారులు చంద్రబాబును రెండు రోజుల పాటు విచారించారు.చంద్రబాబు విచారణను సీఐడీ అధికారులు వీడియో తీయించారు. సీఐడీ విచారణకు ముందు, విచారణ తర్వాత చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సీఐడీ అధికారులను ఏసీబీ కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు విచారించారు. ఇవాళ విచారణ పూర్తైన తర్వాత చంద్రబాబును ఏసీబీ కోర్టు ముందు వర్చువల్ గా హాజరు పర్చారు. ఇదిలా ఉంటే చంద్రబాబును మరో మూడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసే యోచనలో ఉందని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement