Thursday, April 25, 2024

బ‌లగం వేణుకి చిరంజీవి ప్ర‌శంస‌ల జ‌ల్లు…

హైదరాబాద్‌: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం నేపథ్యంలో తెరకెక్కిన బలగం మూవీ సంచ‌ల‌న విజ‌యం సాధించింది..ఇటీవల విడుదలైన ఈ సినిమా అంతటా మంచి టాక్‌ సొంతం చేసుకుని నిర్మాత‌ల‌కు కాసులు కురిపిస్తున్న‌ది.. జ‌బ‌ర్ద‌స్త్ ప‌రిచ‌య‌మైన వేణు టిల్లు తొలిసారి మెగాఫోన్ ప‌ట్టి బ‌ల‌గం ను చిన్న‌సినిమా స్థాయి నుంచి బ్లాక్ బ‌స్ట‌ర్ మెగాస్టార్‌ చిరంజీవి శనివారం ఉదయం ‘బలగం’ టీమ్‌ను ప్రశంసించారు. ‘భోళా శంకర్‌’ సెట్‌లో ‘బలగం’ టీమ్ చిరంజీవిని క‌లిసింది.. ఈ సంద‌ర్బంగా చిరంజీవి చిత్ర బృందాన్ని స‌త్క‌రించారు..

”కంగ్రాట్స్‌ వేణు. చిత్రాన్ని చక్కగా రూపొందించావు. ఇంత బాగా సినిమా చేసి మాకు షాకులు ఇస్తే ఎలా? (నవ్వులు). నిజాయతీ ఉన్న సినిమా ఇది. కమర్షియల్‌ ప్రొడ్యూసర్‌ ఉన్నప్పటికీ నువ్వే దీనికి పూర్తి న్యాయం చేశావు. తెలంగాణ సంస్కృతిని 100 శాతం చూపించావు. వేణు గతంలో ‘జబర్దస్త్‌’ వేదికపై ఓ స్కిట్‌ చేశాడు. వేణుకు ఇంత టాలెంట్‌ ఉందా? అని అతడిపై నాకు గౌరవం పెరిగింది. ఈ సినిమా చూశాక.. తన టాలెంట్‌ని మరోసారి నిరూపించుకున్నాడనిపించింది” అని చిరు ప్ర‌శంస‌లు కురిపించారు.

దీనికి సంబంధించిన వీడియోను ‘బలగం’ హీరో ప్రియదర్శి ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశాడు. ”చిరు అన్నయ్యా.. మీ సినిమాలు చూసి ఎన్నో సందర్భాల్లో నేను స్ఫూర్తి పొందాను. అలాంటి నేను ఈ రోజు మీ పక్కన నిల్చొని మీ ప్రేమాభిమానాన్ని పొందడం చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చింది. ‘బలగం’ కోసం మీరు చేసిన ప్రతి దానికి ధన్యవాదాలు. ఏదో ఒకరోజు మీతో కలిసి పనిచేస్తానని ఆశిస్తున్నాను” అని పేర్కొన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement