Tuesday, April 23, 2024

విద్యార్థులకు తల్లి మొదటి గురువు.. మేయ‌ర్

నిజామాబాద్, మార్చి 11 (ప్రభ న్యూస్) : విద్యార్థులకు మొదటి గురువు తల్లి అని, తల్లిదండ్రులు పిల్లలను సక్రమమైన మార్గంలో వెళ్లేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని నగర మేయర్ నీతూ కిరణ్ అన్నారు. శనివారం నిజామాబాద్ నగరంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఇంటిగ్రల్ ఫౌండేషన్ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే సెర్మనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ నీతూ కిరణ్, డిప్యూటీ మేయర్ ఇధ్రిస్ ఖాన్ ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్ధులకు అకాడమిక్ సర్టిఫికెట్ లు అందజేశారు.

ఈ సందర్భంగా నగర మేయర్ నీతూ కిరణ్ మాట్లాడుతూ… విద్యార్థులకు చదువుతో పాటు నైతిక విలువలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ముఖ్యమని తెలిపారు. టీచర్లు పాఠశాలలో విద్యను నేర్పిస్తారని ఇంటికి వచ్చిన తరువాత తల్లిదండ్రులు పిల్లల గురించి సమయం కేటాయించాలని సూచించారు. పిల్లలకు ఇంటి వాతావరణం ఎలా ఉంటే అలా తయారువుతారన్నా రు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పాఠశాల యాజమాన్యాన్ని అభినందిం చారు. చిన్నారులు ప్రత్యేక వేషధారణలో చేసిన నృత్య ప్రదర్శనలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. గ్రాడ్యుయేషన్ డే లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అబ్దుల్ మాలిక్ షారీఖ్, ప్రిన్సిపాల్ గంగా కిషోర్, వైస్ ప్రిన్సిపాల్ సారా ఫాతిమా, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement