Wednesday, May 15, 2024

Chintapalli – పేద‌ల‌కు మంచి విద్య ఇస్తుంటే… విప‌క్షాలు విషం క‌క్కుతున్నాయిః జ‌గ‌న్

అల్లూరి జిల్లా: విద్యార్థులకు మంచి చేస్తుంటే విష ప్రచారం చేస్తున్నారని, విద్యార్థులకు చెడు చేస్తున్నామంటూ తప్పుడు రాతలు రాశారంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప‌క్షాలపై మండిపడ్డారు. ”గిట్టని వాళ్లు జగన్‌ దుబారా చేస్తున్నాడంటూ మాట్లాడుతున్నారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా పేదలకు ఈ స్థాయిలో ఖర్చుచేయలేదు. ఖర్చు చేసే ప్రతీ రూపాయి భావితరాల కోసమే” అని సీఎం పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఎనిమిదో తరగతి విద్యార్థులకు వరుసగా రెండో ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్స్‌ పంపిణీ చేపట్టింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి నుంచి సీఎం జగన్‌.. గురువారం ఈ పంపిణీని ప్రారంభించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ, ”పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే. విద్యార్థులకు మంచి చేస్తుంటే విష ప్రచారం చేస్తున్నారు. విద్యార్థులకు చెడు చేస్తున్నామంటూ తప్పుడు రాతలు రాశారు. పేద విద్యార్థులపై విషం కక్కొద్దని చెబుతున్నా. దిగజారుడు రాతలు రాయొద్దని చెబుతున్నా. పేద పిల్లల చేతిలో ట్యాబ్‌లు ఉంటే చెడిపోతారంట. పేద విద్యార్థులు ఇంగ్లీష్‌ మీడియంలో చదవద్దా?. పేద పిల్లలు ఇంగ్లీష్‌ మీడియం చదివితే తెలుగు అంతరించుకుపోతుందట. పేదలకు మంచి చేస్తుంటే మీకెందుకు ఈ కడుపుమంట. పేదల పిల్లలకు మంచి చేస్తుంటే విప‌క్షాలు ఏడుస్తున్నారు. ఇటువంటి దిక్కుమాలిన రాజకీయాలతో యుద్ధం చేస్తున్నాం” అంటూ సీఎం జగన్‌ ధ్వజమెత్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement