Sunday, May 5, 2024

సాహితీవేత్త పత్తిపాక మోహన్‌కు బాల సాహిత్య పురస్కారం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : సిరిసిల్ల చేనేత ముద్దుబిడ్డ పత్తిపాక మోహన్‌ను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడ‌మీ బాల సాహిత్య పురస్కారాన్ని కవి, సాహిత్య విమర్శకులు పత్తిపాక మోహన్ అందుకున్నారు. సోమవారం న్యూఢిల్లీలోని త్రివేణి కళా సంఘంలో జరిగిన సాహిత్య పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డా.చంద్రశేఖర్‌ కంబార్, అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావుల చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా మొత్తం 22 మంది రచయితలకు బాల సాహిత్య పురస్కారాలు కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించగా, తెలుగులో బాలల తాత బాపూజీ గేయ కథకుగాను మోహన్‌కు బాాల సాహిత్య పురస్కారం దక్కింది. పత్తిపాక మోహన్ బాలల కోసం అనేక రచనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లోని కథలను తెలుగులోకి అనువదించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement