Tuesday, May 14, 2024

చికోటి ప్ర‌వీణ్ విన‌తిని వారంలో ప‌రిశీలించాలి.. హైకోర్టు

క్యాసినో కేసులో ప్రధాన నిందితుడు చికోటి ప్రవీణ్ త‌న‌కు పోలీస్ భద్రత కల్పించాలంటూ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. విచారించిన హైకోర్టు… చికోటి ప్రవీణ్‌ వినతిని వారంలో పరిశీలించాలని హైదరాబాద్ సీపీని ఆదేశించింది. తనకు, తన కుటుంబీకుల ప్రాణాలకు ముప్పు ఉందని ప్రవీణ్‌ పిటిషన్ వేశారు. ఈడీ దర్యాప్తు పూర్తయ్యే వరకు పోలీస్ భద్రత కావాలని కోరారు. ఈనెల 4న వినతిపత్రం ఇచ్చినప్పటికీ పోలీసులు సహకరించడం లేదని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement