Saturday, April 27, 2024

సుబ్రతా రాయ్‌కు బ్రెయిన్‌ సర్జరీ.. సక్సెస్ ఫుల్ గా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి..

సహారా ఇండియా గ్రూప్‌ చీఫ్‌ సుబ్రతా రాయ్‌ న్యూరోలాజికల్‌ సర్జరీ చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం ముంబైలోని కోకిలాబెన్‌ ధీరూబాయి అంబానీ ఆస్పత్రిలో ప్రత్యేక వైద్యుల బృందం.. సుబ్రతా రాయ్‌కు బ్రెయిన్‌ సర్జరీ చేసింది. డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం.. సుబ్రతా రాయ్‌కు చేసిన బ్రెయిన్‌ సర్జరీ విజయవంతం అయినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన తరువాత.. సోమవారం ఆయన్ను వైద్యులు డిశ్చార్జి చేశారు. 73 ఏళ్ల సుబ్రతా రాయ్‌కు బ్రెయిన్‌కు సంబంధించిన సమస్యతో బాధపడుతూ ఉండేవారు.

ఇది కూడా చ‌ద‌వండి : మళ్లి మొదటికే..! బందరు పోర్టు టెండర్లు రద్దు..

దీనికి సంబంధించిన అన్ని వైద్య పరీక్షలు చేయించిన వైద్యులు.. బ్రెయిన్‌కు కోయిలింగ్‌ చేయాలని నిర్ణయించారు. కోయిలింగ్‌ స్టంట్‌, ఎండో సెక్యులర్‌ డివైజ్‌ ద్వారా సర్జరీ పూర్తి చేశారు. ఈ సర్జరీ.. కేడీఏహెచ్‌ సర్జన్‌ డాక్టర్‌ మనీష్‌ శ్రీవాస్తవ్‌ జనవరి 6న చేశారు. సుబ్రతా రాయ్‌ కుటుంబ సభ్యులు, మేనేజింగ్‌ వర్కర్‌ సూచన మేరకు సర్జరీ చేశారు. శస్త్ర చికిత్స విజయవంతమైనట్టు సుబ్రతా రాయ్‌ కంపెనీ ప్రతినిధులు ఓ ప్రకటనలో వెల్లడించారు. సర్జరీ సక్సెస్‌ అయినందుకు కోకిలాబెన్‌ ధీరూబాయి అంబానీ ఆస్పత్రి సిబ్బంది ధన్యవాదాలు తెలియజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement