Friday, April 26, 2024

మళ్లి మొదటికే..! బందరు పోర్టు టెండర్లు రద్దు..

విజయవాడ, ప్రభన్యూస్ : కృష్ణాజిల్లా ప్రజల చిరకాల స్వప్నం బందరు పోర్టు. ఎంతో ఘన చరిత్ర కలిగిన బందరు పోర్టు నిర్మాణం జరిగితే జిల్లా సమగ్రాభివృద్ధికి దోపదపడుతుందనే ఆశతో జిల్లావాసులు ఎదురు చూస్తున్నారు. ఎన్నో ఉద్యమాల ద్వారా ప్రజలు సాధించుకున్న ఈ పోర్టు నిర్మాణ పనులకు మోక్షం కలగడం లేదు. ప్రభుత్వాలు మారుతున్న ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనుకకు అన్నచందంగా మారింది. ఈ నేపథ్యంలో బందరు పోర్టు నిర్మాణానికి రెండోసారి పిలిచిన టెgడర్లకూ స్పందన లేదన్నారు. నాలుగు సార్లు గడువు పొడిగించినా ఫలితం లేకపోయింది. దీంతో ఏపీ మారిటైం బోర్డు టెgడరు ప్రకటనను రద్దు చేసింది. తిరిగి పోర్టు నమూనాలను మార్పు చేసి తిరిగి టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు.

అంగ్లేయుల పాలన విరాజిల్లిన బందరు పోర్టు…
బందరు పోర్టుకు ఎంతో ఘన చరిత్ర ఉంది. అంగేయుల పాలనలో కీలకమైన పోర్టుగా భాస్లింది. అయితే స్వదేశ పాలనలో పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో ఎగుమతులు, దిగుమతులు తగ్గడంతో కాలక్రమేణ పోర్టు మూతపడింది. రెండు వేల సంవత్సరాల పూర్వం నుంచే ఇక్కడ నుంచి విదేశాలకు ఎగుమతులు, దిగుమతులు జరిగేవి. తర్వాత 1611లో ఆంగ్లేయులు, అంతకుముందు డచ్చి, పోర్చుగీసు వారు మచిలీపట్నంలో అడుగుపెట్టి, దీన్ని తమ వ్యాపార స్థావరంగా మార్చుకున్నారు. తర్వాత బందరు పోర్టు ద్వారా ఎగుమతులు, దిగుమతలు సాగించారు. స్వాతంత్రానికి పూర్వం వరకు కూడా బందరు పోర్టు ద్వారా ఎగుమతులు, దిగుమతలు సాగేవి. కాలానుక్రమంగా బందరు పోర్టు ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయ్యాయి.

ఈ నేపథ్యంలో ప్రజలు, ఉద్యమకారులు బందరు పోర్టు కోసం నిరసన దీక్షలు, ఆందోళనలు చేపట్టారు. దీంతో 2008 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి బందరు పోర్టు పనులకు శంకుస్థాపన చేశారు. అయితే పోర్టు నిర్మాణానికి సంబంధించిన పట్టా భూమి సమకూరకపోవటంతో పనులు మొదలుకాలేదు. తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ మూడు సంవత్సరాల తర్వాత గానీ పోర్టు పనులపై దృష్టిపెట్టలేదు. తర్వాత మచిలీపట్నం అర్బన్‌ డవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేయటం, మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించటం, డీపీఆర్‌లు సిద్దపరచటం, తదితర పనులను చేయించింది. అలాగే రైతుల నుంచి పట్టాభూములు కొనుగోలు చేసేం దుకు ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి రూ. 200ల కోట్ల నగదును కూడా ఇప్పించింది. ఈ సందర్భంలో ఎన్నికల కోడ్‌ మరో 15 రోజుల్లో వస్తుందనుకున్న తరుణంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2019 ఫిబ్రవరి 7వ తేదీన పోర్టు పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్నికలు ముగియటం, అధికారంలోకి వచ్చిన వైసీపీ పోర్టు పనులపై సమీక్ష చేయటం, నవయుగతో అగ్రిమెంట్‌ను రద్దు చేసుకోవటం, అన్నీ చక.. చక జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో పోర్టు సంబంధించి ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి సర్వే, ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయించడంతో పాటు నిధులు సమకూర్చుకోవడానికి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసింది. బందరు పోర్టు నిర్మాణానికి మొత్తం 5200ల ఎకరాల భూమి అవసరమవుతుందని అంచనా వేశారు.

ఇది కూడా చ‌ద‌వండి : ఆరోగ్య శాఖను కుదిపేస్తున్న నకి’లీలలు’ .. ఉద్యోగ నియామకాల్లో వెలుగుచూసిన అవినీతి బాగోతం

అయితే ఇందులు మూడు వేల ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్‌ భూమి ఉంది. 700ల ఎకరాల ల్యాండ్‌ ఫూలింగ్‌లో ఉంది. మిగిలిన దాదాపు 1700ల ఎకరాల పట్టాభూమిలో ముడా 430 ఎకరాలను కొనుగోలు చేసింది. భూమి కొనుగోలు పధకం ద్వారా రైతుల నుంచి ఈ భూమిని కొనుగోలు చేసింది. ఎకరానికి రూ. 25లక్షల చొప్పున ఈ భూమిని కొనుగోలు చేయగా.. పనులు ప్రారంభానికి అవసరమయ్యే రోడ్డు నిర్మాణ పనులకు కావల్సిన భూములకు రూ. 45లక్షల చొప్పున ప్రభుత్వం చెల్లించింది. ఇప్పటికే పోర్టుకు సంబంధించిన దాదాపు అన్ని అవంతరాలు తొలగిపోయాయి. ఇంకా కొంతమేరకు భూముల సేకరణ చేయాల్సి ఉన్నా, పనులు ప్రారంభమైతే అవి సమకూరే అవకాశాలున్నాయి. అయితే అసల కథ ఇక్కడే ఉంది. టెండర్లు ఖరారు అయితేనే పోర్టు నిర్మాణం ముందుకు సాగే పరిస్థితి లేదు.మూడో సారి టెండర్ల ప్రకటనకైనా గుత్తేదారులు స్పందిస్తారో లేదోవేచిచూడాల్సి ఉంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement