Friday, April 26, 2024

Breaking : సింగ‌ర్ ల‌తా మంగేష్క‌ర్ కి క‌రోనా – ఐసీయూలో చికిత్స‌

సింగ‌ర్ ల‌తా మంగేష్క‌ర్ కి క‌రోనా పాజిటీవ్ గా నిర్థార‌ణ అయింది. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుప‌త్రిలో చికిత్స‌ని అందిస్తున్నారు. ఐసీయూలో ల‌తా మంగేష్క‌ర్ కి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. హిందీ చిత్రాలలో ప‌లు పాట‌లు పాడారు. ఈమె న‌టి కూడా. కాగా 1942లో తన కళాప్రయాణం ప్రారంభమైంది మహల్ సినిమాలో ఆయెగా ఆయెగా ఆయెగా ఆనేవాలా పాటతో ఆమె కెరీర్ ప్రారంభ‌మ‌యింది. ఈమె 980 సినిమాల‌కి త‌న గాత్రాన్ని అందించారు. దాదాపు 20 భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడిన ఘటికురాలు. ఈమె సోదరి ఆషా భోంస్లే అనే సంగ‌తి తెలిసిందే. లతాకు భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారం ఇచ్చి సత్కరించింది. హిందీ సినీపాటల గాయని అంటే మొదట లతా పేరే స్ఫురణకొస్తుంది. హిందీ పాటలపై, హిందీసినీ జగత్తుపై ఆమె వేసిన ముద్ర అటువంటిది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement