Wednesday, April 24, 2024

‘అక్ష‌య్ కుమార్’ ని పోలీసుల‌కి ప‌ట్టించిన స‌మంత – ఎందుకో తెలుసా

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత మంచి దూకుడుమీదుంది. సినిమాల‌తోనే కాదు మ‌రోప‌క్క ఐటెం సాంగ్ లో కూడా త‌న హ‌వాని చాటిచెప్పింది పుష్ప చిత్రంలో. ఇక ప‌లు యాడ్స్ లో కూడా న‌టిస్తోంది ఈ భామ‌. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ చిత్రాల్లో కూడా న‌టిస్తోంది. కాగా తాజాగా సమంత కుర్‌ కురే యాడ్‌ లో నటించింది. ఈ యాడ్‌ లో సమంత తో పాటు బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ నటించాడు. కాసేటి క్రితమే.. ఈ యాడ్‌ రిలీజ్‌ అయింది. అయితే.. ఈ యాడ్‌ లో అక్షయ్‌ కుమార్‌ సమంత ఇంట్లో దొంగతనానికి వస్తాడు. అయితే.. అది గమనించిన సమంత.. అక్షయ్‌ కుమార్‌ కు కుర్‌ కురే తినిపిస్తుంది. దీంతో అక్షయ్‌ అక్కడే రిలాక్స్‌ అవుతాడు. ఈ నేపథ్యంలో పోలీసులకు అక్షయ్‌ కుమార్‌ ను పట్టిస్తుంది సమంత. ఈ యాడ్‌ ను తాజాగా సమంత తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ యాడ్‌ వైరల్‌ గా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement