Saturday, May 18, 2024

Manifesto – చిదంబ‌రం ఛైర్మ‌న్ గా కాంగ్రెస్ ఎన్నిక‌ల మేనిఫెస్టో క‌మిటీ…

న్యూఢిల్లీ – 2024 లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసి దానికి మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరాన్ని చైర్మన్‌గా నియమించింది. ఈ మేనిఫేస్టో కమిటీలో 16మంది సభ్యులు ఉంటారు. కన్వీనర్‌గా ఛత్తీస్‌గఢ్‌ మాజీ డిప్యూటీ సీఎం టీఎస్‌ సింగ్‌దేవ్‌ ఉండనున్నారు. మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఆనంద్‌ శర్మ, జైరామ్‌ రమేశ్‌, శశిథరూర్‌ ఉండనున్నారు.

అయితే, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. రాబోయే సార్వత్రిక ఎన్నికల 2024 కోసం ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ మ్యానిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో కేంద్ర మాజీ మంత్రులు ఆనంద్ శర్మ, జైరాం రమేష్, శశి థరూర్ లతో పాటు ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చీఫ్ ప్రవీణ్ చక్రవర్తితో పాటు సీనియర్ కాంగ్రెస్ నేత, మణిపూర్ మాజీ డిప్యూటీ సీఎం గైఖాంగమ్, లోక్‌సభలో ఆ పార్టీ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్ కూడా కమిటీలో ఉన్నారు. ఎన్నికల కోసం పార్టీ ఎజెండాను ఖరారు చేసే కీలక ప్యానెల్‌లోని ఇతర సభ్యులు ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి, కె రాజు, ఓంకార్ సింగ్ మార్కం, రంజీత్ రంజన్, జిగ్నేష్ మేవానీ, గుర్దీప్ సప్పల్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement