Sunday, April 28, 2024

Naked Party – మాస్కోలో ‘న్యూడ్’ పార్టీ …పుతిన్ కుమార్తెతో స‌హా టాప్ సెల‌బ్రిటీలు హాజ‌రు

ర‌ష్యా రాజధాని మాస్కోలో ‘నగ్న’ పార్టీ వేడుక‌గా నిర్వ‌హించారు .ముటాబోర్‌లోని ఓ పాప్యులర్ నైట్ క్లబ్‌లో జరిగిన ఈ పార్టీకి టీవీ ప్రెజెంటర్, నటి అనస్టాసియా ఇవ్లీవా ఈ నెక్ డ్ పార్టీకి ఆతిథ్యం ఇచ్చారు. ఈ పార్టీకి హాజ‌ర‌య్యే వారు న్యూడ్ గా ఉండాలి.. ఇటువంటి నెక్ డే పార్టీలో పాప్ స్టార్లు ఫ్లిప్ కిర్కోరోవ్, లోలిత, డిమా బిలాన్, టీవీ హోస్ట్, 2018 అధ్యక్ష అభ్యర్థి కెసెనియా సోబ్‌చక్ సహా పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సోబ్‌చక్‌ను ‘గాడ్‌ డాటర్’గా పేర్కొంటారు. రష్యా రాజకీయవేత్త మారియా బుటినా కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు..

ఈ పార్టీలో పాల్గొన్న వారి ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష్యం కావ‌డంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ పార్టీ దేశ సంప్రదాయ విలువలను మట్టిలో కలిపేసిందంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో మండిపడ్డారు. దీంతో ఈ నగ్న పార్టీ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఆ పార్టీ జరిగిన రెండోరోజున పోలీసులు ఆ నైట్‌క్లబ్‌పై దాడిచేశారు. అయితే, ఆ రోజున గెస్ట్‌లు నిండా దుస్తులు ధరించి కనిపించారు. అలాగే నెక్ డ్ పార్టీ ఫోటోలు,వీడియోలు కూడా అక్క‌డ దొర‌క‌లేదు..ఇక ఈ పార్టీకి హాజరైనవారిని సోష‌ల్ బాయ్‌కాట్ చెయ్యాలని సంప్ర‌దాయ‌వాదులు పిలుపు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement