Saturday, October 12, 2024

IPL END GAME | టాస్ గెలిచి ‌‌‌‌‌‌బౌలింగ్ ఎంచుకున్న చెన్నై

ఐపీఎల్‌-16 సీజన్‌ చివరి అంకానికి చేరుకుంది. రెండు నెలలుగా క్రికెట్‌ అభిమానుల్ని అలరించిన ఈ మెఘా క్రికెట్‌ లీగ్‌లో ఇవ్వాల (సోమవారం) ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. టైటిల్‌ కోసం చెన్నై సూపర్‌కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ జట్లు అహ్మదాబాద్ లో అమీతుమీకి సిద్ధమయ్యాయి. విజేతను తేల్చే మహా సమరాన్ని వీక్షించేందుకు క్రికెట్‌ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఐదోసారి కప్‌ గెలిచి ముంబై రికార్డును సమం చేయాలని ధోనీ సేన ఉవ్విళ్లూరుతుండగా, వరుసగా రెండోసారి కప్‌ గెలిచి సత్తా చాటాలని హార్దిక్‌ బృందం పట్టుదలతో ఉంది. వ‌ర్షం కారణంగా నిన్న (ఆదివారం) జరగాల్సిన మ్యాచ్ నేటికి వాయిదా పడింది. కాగా.. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై కెప్టన్ ధోనీ బౌలింగ్ఎం చుకున్నాడు. మ‌రి కొద్ది సేప‌ట్లో ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ ప్రారంభం కానుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement