Tuesday, May 14, 2024

రూమర్లకి చెక్ ..ఎన్టీఆర్ తో కొరటాల శివ సినిమా అప్ డేట్

రూమర్లకి చెక్ పెట్టారు దర్శకుడు కొరటాల శివ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 30వ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ కొత్త చిత్రం త్వరలోనే పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో, ప్రారంభ షెడ్యూల్ కు సంబంధించిన చర్చల్లో దర్శకుడు కొరటాల శివ, కెమెరామన్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ పాల్గొన్నారు. దీనిపై యువసుధ ఆర్ట్స్ తన సోషల్ మీడియా అకౌంట్లో వెల్లడించింది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. కాగా, ఈ చిత్రం ఆగిపోయిందంటూ ఇటీవల ప్రచారం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement