Tuesday, April 30, 2024

కరోనా వైరస్‌కు లోహాలతో చెక్‌.. సిలికాన్‌, బంగారం, రాగితో ప్రయోగం

కొవిడ్‌-19 మహమ్మారి ముప్పు నుంచి ప్రపంచానికి తాత్కాలిక ఉపశమనమైతే లభించింది. కానీ, సార్స్‌ కోవ్‌-2 వైరస్‌ ఉత్పరివర్తనాలు ఏరూపంలో, ఎటువైపు నుంచి మానవాళిని కబలిస్తాయోననే భయాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. చైనా వైరస్‌ పరివర్తనలపై ప్రపంచ దేశాల ప్రయోగశాలలు నిరంతర నిఘా ఉంచాయి. ఈ నేపథ్యంలో వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే దిశగా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. భవిష్యత్‌లో మరో మహావిపత్తు ఎదురవకుండా ఉండాలని శాస్త్రవేత్తలు నిర్విరామంగా తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు చెందిన కర్జిన్‌ యూనివర్సిటీ వైద్యవిద్యార్థుల పరిశోధన ఆశాజనకంగా కనిపిస్తోంది. కొవిడ్‌-19 వైరస్‌ను ధ్వంసంచేసే విధానాన్ని వీరు ఆవిష్కరించారు. ఈ పరిశోధన ఫలితాలను కెమికల్‌ సైన్స్‌ జర్నల్‌ ప్రచురించింది. లోహాలతో వైరస్‌ను బంధించి, ధ్వంసం చేసే ప్రక్రియను ఆవిష్కరించారు. సిలికాన్‌, బంగారం, రాగితో సమ్మేళనంతో కొవిడ్‌-19 స్పైక్‌ ప్రొటీన్‌ను బంధించొచ్చని నిరూపించారు. ఆ తర్వాత ఈ ప్రోటీన్లను నాశనం చేయడానికి విద్యుత్‌ క్షేత్రాలను ఉపయోగించవచ్చని కనుగొన్నారు.

- Advertisement -

సార్స్‌కోవ్‌-2 వైరస్‌ మానవ కణాలలోకి ప్రవేశించడానికి స్పైక్‌ ప్రోటీన్‌ను ఉపయోగిస్తుంది. అందుకే పరిశోధకులు స్పైక్‌ ప్రొటీన్‌ను దిగ్బంధించే ప్రక్రియపై దృష్టిసారించారు. కరోనావైరస్‌లు వాటి అంచున స్పైక్‌ ప్రోటీన్‌లను కలిగి ఉంటాయి. ఇవి #హూస్ట్‌ కణాలలోకి చొచ్చుకుపోయి ఇన్‌ఫెక్షన్‌ను కలిగించేలా చేస్తాయి. బలమైన రసాయన బంధాన్ని ఏర్పరిచే ప్రతిచర్య ద్వారా సిలికాన్‌, బంగారం, రాగి ఉపరితలంపై ఈ ప్రోటీన్లు అతుక్కుపోయేలా చేయగలిగాం అని అధ్యయన ప్రధాన పరిశోధకుడు నాడిమ్‌ డార్విష్‌ చెప్పారు.

ఈ పదార్థాలను ఎయిర్‌ ఫిల్టర్‌లలో, బెంచీలు, టేబుల్‌, గోడలకు పూతగా వేయడం లేదా వస్త్రంతో తుడవడం, ఫేస్‌ మాస్క్‌లలో ఉపయోగించడం ద్వారా కరోనావైరస్‌ను సంగ్రహించడానికి ఉపయోగించవచ్చని నిర్ధారించాం అని డార్విష్‌ చెప్పారు. ఈ విధంగా కరోనాను సంగ్ర#హంచడం వల్ల అది ఎక్కువ మందికి చేరకుండా మరియు సోకకుండా నిరోధించవచ్చని పరిశోధకులు తెలిపారు. ఎలక్ట్రికల్‌ పల్స్‌ను ఉపయోగించి కరోనావైరస్‌ను గుర్తించి నాశనం చేయవచ్చని అధ్యయనం కనుగొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement