Thursday, April 25, 2024

తన జన్మదిన వేడుకలు జరపొద్దని చంద్రబాబు సూచన

ఏప్రిల్ 20న టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా చంద్రబాబు ట్విట్టర్ ద్వారా టీడీపీ అభిమానులకు ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ఎవరూ తన జన్మదినం సందర్భంగా సమావేశాలు నిర్వహించవద్దని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు.

“నా జన్మదినానికి ఒక ప్రత్యేకత తీసుకువచ్చేందుకు మీరందరూ నిర్వహించే కార్యక్రమాలు అభినందనీయమే. అందుకు మీకందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కానీ ఇప్పటి పరిస్థితుల్లో కరోనా నుంచి రక్షణ పొందడం చాలా అవసరం. అందుకే నా జన్మదినం సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని టీడీపీ నేతలను, కార్యకర్తలను కోరుతున్నాను. దయచేసి అందరూ భౌతికదూరం పాటిస్తూ సురక్షితంగా ఉండండి. మీ అందరి క్షేమమే మీరు నాకు అందించే జన్మదిన కానుకగా భావిస్తాను” అని చంద్రబాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement