Monday, April 29, 2024

బీబీసీ తరహాలో ‘డిడి ఇంటర్నేషనల్’.. కేంద్ర ప్రభుత్వం కసరత్తు!

ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ‘బీబీసీ’ ఛానల్ తరహా సరి కొత్త ఛానల్ ను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తతం ఉన్న ప్రసార భారతిని అధునికరించేందుకు ప్రణాళికులు సిద్ధం చేస్తోంది. కోవిడ్ సెకండ్ వేవ్ లో మహమ్మారిని అడ్డుకట్ట వేయడంలో కేంద్రం ప్రభుత్వం ఘెరంగా విఫలమైందంటూ పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేస్తున్న క్రమంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జాతీయ మీడియాలో కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వాటికి ధీటుగా ప్రభుత్వ ఛానల్ ను ఉండేలా కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దూరదర్శన్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా ప్రణాళికలు రచిస్తోంది. ‘డిడి ఇంటర్నేషనల్’కు సంబంధించిన డీపీఆర్ ను కూడా సిద్ధం చేస్తోంది. ప్రపంచాన్ని భారత దేయం యోక్క ప్రాముఖ్యాన్ని తెలియజేసే విధంగా ఈ ప్రాజెక్ట్ ను రూపొందిస్తున్నారు. ప్రసార భారతి ప్రపంచవ్యాప్తంగా బ్యూరోలను ఏర్పాటు చేయాలని భావిస్తుంది. సమకాలీన సమస్యలపై భౌగోళిక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం, ప్రసార భారతి డిడి ఇండియా కంటెంట్ ఆధారంగా గ్లోబల్ న్యూస్ సర్వీస్ కోసం స్ట్రాటజీ రోడ్‌ మ్యాప్‌ ను కూడా సిద్ధం చేస్తోంది.

ప్రసార భారతి సిఇఓ శశి శేఖర్ వేంపతి మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టుకు మార్చిలో ప్రసార భారతి బోర్డు అనుమతి ఇచ్చిందని చెప్పారు. దూరదర్శన్ ఇంటర్నేషనల్ కోసం ఒక ప్రాజెక్ట్ బ్లూ-ప్రింట్‌ను అభివృద్ధి చేయడానికి బోర్డు ఆమోదించిందని ఈ ఏడాది మార్చ్ 25న ఆయన ట్వీట్ చేశారు. బోర్డులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ పై గత 8 నెలలుగా చర్చలు జరుగుతున్నాయని, అయితే కరోనా మహమ్మారి అనిశ్చితి కారణంగా ఆసల్యం అవుతోందని వివరించారు.ఈ ప్రాజెక్ట్ కు సంభందించిన నిధుల అంశాలను ప్రభుత్వానికి తెలియజేస్తామని, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని వేంపతి చెప్పారు.  అంతర్జాతీయంగా దూరదర్శన్ ఉనికి కోసం ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. దీనిని “BBC లేదా అల్ జజీరా ఛానల్స్ తో పోల్చారు. ఇది బిబిసి వరల్డ్ సర్వీస్ లాగా ఎక్కువ వార్తలను కలిగి ఉంటుందని అన్నారు. భారతదేశంపై సాంస్కృతిపై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి కలిగిస్తుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement