Sunday, April 28, 2024

హైకోర్టు తరలింపుపై క్లారిటీ!

మూడు రాజధానులు ఏర్పాటులో భాగంగా కర్నూలుకు హైకోర్టు తరలించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా ఈ వ్యవహారంపై కేంద్ర న్యాయశాఖ క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర హైకోర్టు తరలింపు అంశం తమ పరిధిలోనిది కాదని.. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టులే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర న్యాయశాఖ స్పష్టం చేసింది.

హైకోర్టును అమరావతి నుంచి తరలించడంపై ఆర్టీఐ కార్యకర్త ఎం.సాంబశివరావు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. దీనికి కేంద్ర న్యాయశాఖ సమాధానమిచ్చింది. హైకోర్టు నిర్వహణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపింది. రోజువారీ పరిపాలన వ్యవహారాలకు ప్రధాన న్యాయమూర్తి బాధ్యత వహిస్తారు. దీంతో నిర్ణయం తీసుకోవాల్సింది వారే అని పేర్కొంది. కర్నూలుకు తరలించడంపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టులు ఇంకా ఒక అభిప్రాయానికి వచ్చినట్లు లేదని చెప్పింది. పైగా ఈ అంశం రాష్ట్ర హైకోర్టు విచారణలో ఉందని కేంద్ర న్యాయశాఖ వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement