Friday, May 3, 2024

కొవాగ్జిన్ కి అనుమతి నిరాకరించిన బ్రెజిల్..

కొవాగ్జిన్ టీకాను తమ దేశంలో వాడేందుకు బ్రెజిల్ ఆరోగ్య నియంత్రణా సంస్థ అనుమతిని నిరాకరించింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ సంస్థ, ఐసీఎంఆర్ సంయుక్తంగా తయారు చేసిన కొవాగ్జిన్ టీకా ఇప్పుడు ప్రపంచంలోని అత్యుత్తమ ఫలితాలను ఇస్తుంది. యూఎస్ తరువాత అత్యధికంగా కొవిడ్ తో బాధించబడిన దేశంగా బ్రెజిల్ రెండో స్థానంలో ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు కోట్ల కొవాగ్జిన్ డోస్ లకు బ్రెజిల్ నుంచి ఆర్డర్ ఇచ్చింది. అయితే మంచి ఉత్పత్తి విధానాలను భారత్ బయోటెక్ పాటించని కారణంగానే, వాడకం అనుమతిని నిరాకరిస్తున్నామని పేర్కొనడం ఇప్పుడు అందరికీ విస్మయం కలిగిస్తోంది. ఈ వార్తలపై స్పందించిన భారత్ బయోటెక్, బ్రెజిల్ వెల్లడించిన సమస్య ఆ దేశ అధికారులు తమ ప్లాంటును సందర్శించిన సమయంలోనే వచ్చిందని, ఈ సమస్యను త్వరలోనే పరిష్కరించుకుంటామని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement