Wednesday, May 1, 2024

నేటి నుంచి ప్ర‌తి రోజూ ల‌క్ష మందికి క‌రోనా వ్యాక్సినేష‌న్….

నేటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్‌
పీహెచ్‌సీల్లోనూ టీకా
తెెలంగాణలో కొత్తగా 684 కేసులు
రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్‌లు
వైరస్‌ కట్టడికి సర్కార్‌ చర్యలు
నేడు అత్యవసర సమావేశం
ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రీటింగ్‌ను కచ్చితంగా అమలు చేయాలి: ప్రభుత్వం

హైద‌రాబాద్ – రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు మంచి స్పందన వస్తోందని తెలం గాణ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ జి. శ్రీనివాసరావు తెలిపారు. కోఠిలోని ప్రజా రోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి 45ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు చెప్పారు. 45ఏళ్లు నిండిన వారు రాష్ట్రంలో సుమారు 80లక్షల మంది ఉన్నట్లు చెప్పారు. 45ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న, వైద్య, ఫ్రంట్‌ లైన్‌ సిబ్బందికి కలిపి ఇప్పటి వరకు 10లక్షల మందికి మొదటి డోస్‌ టీకా ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2వేల కేంద్రాల్లో ఇందులో 1800 ప్రభుత్వ ఆస్పత్రులు, 250 ప్రయివేటు ఆస్పత్రుల్లో నిరంతరం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోం దన్నారు. ఒక్కో టీకా కేంద్రంలో ప్రతి రోజూ 100మందికి వ్యాక్సిన్‌ వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. జులై 31నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తు న్నట్లు వెల్లడించారు. కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని కేంద్రం సూచించిందన్నారు.
ముప్పు ఉన్న అందరికీ టీకా…
రాష్ట్రంలో కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ పూర్తిస్థాయిలో వ్యాప్తి చెందక మునుపే సాధ్య మైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ వేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ క్రమంలో వయసుతో నిమిత్తం లేకుండా కోవిడ్‌ ముప్పును ఎదుర్కొనే అందరికీ వ్యాక్సిన్‌ వేసేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదనను పంపినట్లు చెప్పారు. నిత్యం ప్రజల్లో ఉండే ఉపాధ్యాయులు, బ్యాంకు ఉద్యోగులు, విక్రయ దారులు వీధి వ్యాపారులతోపాటు పలు వర్గాలకు వ్యాక్సిన్‌ వేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయండి: డీహెచ్‌ ఆదేశాలు
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరిగిన నేపథ్యంలో భారత వైద్య పరిశోధనా మండలి మార్గదర్శకాల మేరకు ఆస్పత్రుల్లో ఆర్టీపీసీఆర్‌ టెస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఆస్పత్రుల్లోకి వచ్చే కరోనా పేషెంట్లకు ఆర్టీ పీసీఆర్‌ టెస్టులు చేయాలని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ జి. శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. కరోనా సోకడంతో శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి, కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన వారికి, కరోనా లక్షణాలు లేకుండా ఆస్పత్రుల్లో చేరిన పాజిటివ్‌ రోగులకు, సర్జికల్‌, నాన్‌సర్జికల్‌ విభాగాల్లో చికిత్స పొందుతున్న వారికి, గర్భీణలు, డెలివరీ కోసం ఆస్పత్రిలో చేరిన వారికి ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయాలని ఆదేశించారు. ఆర్టీపీసీఆర్‌ టెస్టుల తాలూకు నివేదికను ఏ రోజుకారోజు సమర్పించాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement