Wednesday, May 8, 2024

ఎల్‌ఐసీలో ఎఫ్‌డీఐలకు కేంద్రం అనుమతి.. 5శాతం వాటా విక్రయానికి సన్నాహాలు

ఐపీఓకి దరఖాస్తు చేసుకున్న ఎల్‌ఐసీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)ను అనుమతిస్తూ కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం. భారతీయ జీవిత బీమాసంస్థలోకి 20శాతం ఎఫ్‌డీఐలను నేరుగా అనుమతించాలని ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం నిర్ణయించిందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయంతో ఇకనుంచి ఎల్‌ఐసీ ఐపీఓలో విదేశీ పెట్టుబడిదారులూ పాల్గొనే వీలు కలుగుతుంది. కేంద్ర నిర్ణయం మేరకు విదేశీ పెట్టుబడిదారులు మరింత ఆసక్తి చూపుతారని అధికారవర్గాలు తెలిపాయి. కాగా ఇప్పటికే దేశీయ బీమా రంగంలో 74శాతం వరకు ఎఫ్‌డీఐకి అనుమతి ఉంది. అయితే ఈ నిబంధన జీవిత బీమాసంస్థకు వర్తించదు. పార్లమెంటులో చట్టం తర్వాత ఎల్‌ఐసీని ఓ ప్రత్యేక సంస్థగా ఏర్పాటు చేయడంతో 74శాతం నేరుగా ఎఫ్‌డీఐ అనుమతి దీనికి వర్తించదు.

తాజాగా ఎల్‌ఐసీలోకి ఎఫ్‌డీఐ అనుమతించడంతో విదేశీ బీమాసంస్థలు, విదేశీ పెన్షన్‌ ఫండ్‌లు దేశంలో అతిపెద్ద ఐపీఓగా భావిస్తున్న ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. దేశీయ సంస్థలో 10శాతం అంతకంటే ఎక్కువ వాటాను కొనుగోలు చేసే విదేశీసంస్థను ఎఫ్‌డీఐగా రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గుర్తిస్తుంది. కాగా ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ కోసం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రభుతం ముసాయిదా పత్రాలను ఈనెల 13న దాఖలు చేసింది. ఎల్‌ఐసీలో 5శాతం వాటాకు సమానమైన రూ.31.6కోట్లుకు పైగా రూ.10 ముఖ విలువ కలిగిన ఈకీటీ షేర్లను ప్రభుత్వం విక్రయించనుంది. దీంతో 63వేల కోట్ల రూపాయలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. మొత్తం సంస్థలో 100శాతం వాటా ఉన్న ప్రభుత్వం 5శాతం వాటాను విక్రయించనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement