Sunday, May 19, 2024

రష్యన్‌ బలగాలను రాకుండా వంతెన పేల్చేందుకు నిర్ణయంచి ఉక్రెయిన్‌ సైనికుడి ఆత్మబలిదానం..

క్రిమియా, ఉక్రెయిన్‌ ప్రధాన భూభాగాన్ని గనులతో కలిపే కీలకమైన వ్యూహాత్మకమైన వంతెన వైపు రష్యా యుద్ధ ట్యాంకులు చొచ్చుకు వస్తున్నాయి. ఉక్రెయిన్‌ రక్షణకు ఎంతో కీలకమైన ఈ మార్గంలో వంతెనను కూల్చేస్తే తప్ప రష్యా ట్యాంకులను అడ్డుకోలేని పరిస్థితి. ఉక్రెయిన్‌ సైనికుడు విటాలీ స్కాకున్‌ వోలోడిమిరోవిచ్‌ ఫ్యూజ్‌ను అమర్చేందుకు ప్రయత్నిస్తుండగా.. రష్యా దళాలు పరిగెత్తుకుంటూ రావడం గమనించాడు. ఫ్యూజ్‌ను అమర్చి తాను సురక్షితంగా బయటపడే అవకాశం లేదని గుర్తించిన సైనికుడు.. విటాలీ స్కాకున్‌.. రష్యన్‌ బలగాలను ఉక్రెయిన్‌లోకి ప్రవేశించడాన్ని అడ్డుకునేందుకు తనను తాను పేల్చుకున్నాడు.

ఆ సైనికుడి సాహసం.. రష్యన్‌ సేనల దూకుడును చాలా తగ్గించగలిగిందని అతడి సహచరులు ప్రశంసించారు. కానీ కళ్లెదుటే తమ సహచరుడిని కోల్పోవడం వారిని తీవ్రంగా బాధించింది. విటాలీని ఉక్రెయిన్‌ సైన్యం రియల్‌ హీరోగా అభివర్ణించింది. అతని త్యాగం ఎంతో గొప్పదని కొనియాడుతూ.. ఉక్రెయిన్‌ మిలిటరీ ఫేస్‌బుక్‌లో రాసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement