Thursday, May 2, 2024

అధికార మార్పిడే పుతిన్‌ లక్ష్యం..! జెలెన్‌ స్కీని ఒంటరి చేయాలని వ్యూహం

ఉక్రెయిన్‌లో అధికార మార్పిడే లక్ష్యంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పావులు కదుపుతున్నాడు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ స్వయంగా రంగంలోకి దిగి.. తన దేశ ఆర్మీకి ధైర్యం నూరిపోస్తున్నాడు. దీంతో తమ అధ్యక్షుడు చేస్తున్న పోరాటంపై ఆర్మీ కూడా అండగా నిలుస్తున్నది. ఎలాగైనా.. ఉక్రెయిన్‌ ఆర్మీని, అధ్యక్షుడు జెలెన్‌ స్కీని విడగొట్టాలనేది పుతిన్‌ వ్యూహం. అందుకు తగ్గట్టుగానే.. ఉక్రెయిన్‌ ఆర్మీకి ఆఫర్లు ఇస్తున్నాడు. అధికారాన్ని మీ చేతుల్లోకి తీసుకోవాలంటూ సూచిస్తున్నాడు. జెలెన్‌ స్కీపైనే ఉక్రెయిన్‌ సైన్యం తిరుగుబాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. జెలెన్‌స్కీని అధికారం నుంచి దించేస్తే.. ఆర్మీ తమ ఆధీనంలోకి వస్తుందన్నది పుతిన్‌ ఆలోచనా. అయినా ఉక్రెయిన్‌ ఆర్మీ మాత్రం పుతిన్‌ మాటలను కానీ.. అతని ఆఫర్‌ను కానీ లెక్కజేయడం లేదు.

నాయకత్వం కూలదోయాలని..

ఉక్రెయిన్‌పై రష్యా మెరుపుదాడికి దిగే అవకాశం ఉందన్న సమాచారం మేరకు మరింత బందోబస్తు పెంచారు. రష్యన్‌ ఆర్మీని అన్ని విధాలుగా ఎదుర్కొనేందుకు గెరిల్లా యుద్ధానికి సిద్ధం అవుతున్నది. అయితే పుతిన్‌ మాత్రం జెలెన్‌స్కీని ఒంటరివాన్ని చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఉక్రెయిన్‌ పౌరులు కూడా రష్యకు వ్యతిరేకంగా ఆయుధాలు చేతపట్టారు. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య చర్చలు జరిగితే.. పరిస్థితి సాధారణం అవుతుందని అందరూ భావించారు. కానీ ఇద్దరూ తగ్గేదేలే.. అన్నట్టుగా ప్రవర్తిస్తుండటంతో ఇరు దేశాల మధ్య మరింత భయానక వాతావరణం ఏర్పడింది. ఉక్రెయిన్‌ నాయకత్వాన్ని కూలదోయాలంటూ ఆ దేశ సైన్యానికి పుతిన్‌ పిలుపునిచ్చారు. అక్కడి అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని సూచించారు. ఉక్రెయిన్‌ నాయకత్వాన్ని ఉగ్రవాదులు, డ్రగ్స్‌ ముఠాగా విమర్శించాడు. అభినవ నాజీలుగా ఉక్రెయిన్‌ నాయకత్వాన్ని పోల్చారు. నయా నాజీలకు మానవ కవచాలుగా మీ పిల్లలు, భార్యలు, పెద్దలను ఉండనీయొద్దు.. అధికారాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి అంటూ పుతిన్‌ పిలుపునిచ్చాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement