Friday, June 9, 2023

ఉచితాలను తీసేసేందుకు కేంద్రం కుట్ర : ఎమ్మెల్సీ క‌విత‌

బీజేపీపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఇస్తున్నట్లు ఇతర రాష్ట్రాల్లో పెన్షన్లు ఎందుకివ్వలేరని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను నిలిపివేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఉచితాలను తీసేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. మోదీ రూ.10 లక్షల కోట్లు తన మిత్రులకు పంచిపెట్టారన్నారు. ఆర్థిక మంత్రి రేషన్ షాపులకు వెళ్లి మోదీ ఫొటోపై కలెక్టర్‌తో గొడవ పెట్టుకున్నారని తెలిపారు. ప్రధాని ఫొటోలు రేషన్ షాపుల్లో పెడతారా అని నిలదీశారు. బీజేపీ సర్కార్ కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని కవిత హెచ్చరించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement