Monday, May 20, 2024

ట్విట్టర్‌కు కేంద్రం నోటీసులు.. నిబంధనలు పాటించే విషయంలో జులై 4 వరకు గడువు

గతంలో ఐటీ శాఖ జారీ చేసిన అన్ని నిబంధనలను అమలు చేసేందుకు ట్విట్టర్‌కు జులై 4 వరకు గడువు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వ శాఖ గతంలో జారీచేసిన నిబంధనలు పాటించే విషయంలో ట్విట్టర్‌కు ఇదే చివరి నోటీస్‌ అని, వాటిని తప్పనిసరిగా అమలు చేయాలని కోరింది.

ఐటీ నిబంధనలు అమలు చేయకుంటే చర్యలు తప్పవని నోటీస్‌లో హెచ్చరించారు. జులై తరువాత ట్విట్టర్‌లో పెట్టే అన్ని పోస్టుకుల ఆ సంస్థదే బాధ్యత అని స్పష్టం చేశారు. జూన్‌ 27న ప్రభుత్వం ఈ నోటీస్‌ జారీ చేసింది. ట్విట్టర్‌కు గతంలో ప్రభుత్వం ఇదే విషయంలో నోటీస్‌ జారీ చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement