Sunday, April 28, 2024

చైల్డ్ సెక్స్ రాకెట్ పై సీబీఐ స్పెష‌ల్ ఆప‌రేష‌న్..

ప్ర‌భ‌న్యూస్ : చిన్నారులతో పోర్నోగ్రఫీ సహా లైంగిక దారుణాలకు పాల్పడుతున్న ముఠాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కొరఢా ఝులిపించింది. మంగళవారం దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 76 ప్రదేశాలపై ఏకకాలంలో దాడులతో భారీ ఆపరేషన్‌ చేపట్టింది. నవంబర్‌ 14న 83 మందిపై 23 వేర్వేరు కేసులు నమోదు చేసిన సీబీఐ, ఆన్‌లైన్‌ వేదికగా సాగిస్తున్న దుర్మార్గాలను వెలికితీస్తోంది. సీబీఐ సోదాలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఢిల్లి, యూపీ, పంజాబ్‌, బిహార్‌, ఒడిశా, తమిళనాడు, రాజస్థాన్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, హర్యానా, ఛత్తీస్‌ గఢ్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఉన్నాయి. 2019లో సీబీఐలోని స్పెషల్‌ క్రైమ్‌ జోన్‌లో ఆన్‌లైన్స్‌ సెక్సువల్‌ అబ్యూజ్‌ అండ్‌ ఎక్స్‌ప్లాయిటేషన్‌ ప్రివెన్షన్‌ – ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఇంటర్నెట్‌ సహా ఆన్‌లైన్‌ మాధ్యమాల ద్వారా చిన్నారులకు సంబంధించి లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వంటి సమాచారాన్ని గుర్తించి, వాటిని పోస్టు చేస్తున్నవారు, తద్వారా వ్యాపారం చేస్తున్నవారిని అరెస్టు చేయడం కోసం ఈ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేశారు.

2020లో ఈ యూనిట్‌ సహాయంతో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ప్రభుత్వ ఇంజనీర్‌ రామ్‌భవన్‌ను అరెస్టు చేసింది. దాదాపు 50 మంది చిన్నారులతో రూపొందించిన వీడియోలు, ఫొటోలను డార్క్‌నెట్‌లో విక్రయించినట్టు గుర్తించింది. రాష్ట్రంలోని చిత్రకూట్‌, బాందా, #హమీర్‌పూర్‌ జిల్లాల్లోని 5-16 ఏళ్ల వయ స్సు కల్గిన చిన్నారుల జీవితాలను ఛిద్రం చేస్తూ ఈ దారుణాలకు ఒడిగట్టినట్టు సీబీఐ తేల్చింది. తాజా గా బాలల దినోత్సవం నాడు 23 వేర్వేరు ఆన్‌లైన్‌ చైల్డ్‌ సెక్స్‌ రాకెట్ల వ్యవహారాన్ని గుర్తించి కేసులు నమో దు చేసి, దేశవ్యాప్తంగా ఏకకాలంలో భారీ సోదాలకు తెరలేపింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తిరుపతి నగరాలు కూడా ఉన్నాయని తెలిసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement