Thursday, May 2, 2024

తేజ‌స్వి యాద‌వ్ కి బెయిల్ ర‌ద్దు చేయాల‌ని కోరిన – సీబీఐ

బీహార్ డిప్యూటీ సీఎం..ఆర్జేడీ కీల‌క‌నేత తేజ‌స్వి యాద‌వ్ కి ఇచ్చిన బెయిల్ ని ర‌ద్దు చేయాల‌ని ఢిల్లీ హైకోర్టుని సీబీఐ కోరింది.రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) కుంభకోణం కేసులో తేజస్వి యాదవ్ బెయిల్ వ‌చ్చింది. కాగా ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో తమ అధికారులను బెదిరించేలా తేజస్వి మాట్లాడారని కోర్టుకు సీబీఐ తెలిపింది. ఈ నేపథ్యంలో తేజస్వికి ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయెల్ నోటీసులు పంపారు. హోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కు సంబంధించిన ఈ కేసులో 12 మంది వ్యక్తులు, రెండు కంపెనీలపై సీబీఐ కేసు నమోదు చేసింది. 2006లో రాంచీ, పూరీలో ఐఆర్సీటీసీ హోటల్స్ కాంట్రాక్ట్ లో అవకతవకలు జరిగాయని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ కేసులో 2018 ఆగస్టులో తేజస్వి యాదవ్, ఆయన తల్లి రబ్రీదేవిలకు బెయిల్ మంజూరయింది. ఇదే కేసులో ఈడీ కూడా మనీలాండరింగ్ ఆరోపణలతో ఛార్జిషీట్ నమోదు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement