Wednesday, May 1, 2024

గ్లోబల్‌ చెస్ లీగ్‌కు కార్ల్‌సన్‌, విశ్వనాథన్‌, యిఫాన్‌

గ్లోబల్‌ చెస్‌లీగ్‌ మొదటి సీజన్‌ దుబాయ్‌ చెస్‌ అండ్‌ కల్చర్‌క్లబ్‌లో జూన్‌ 21 నుంచి జులై 2 వరకు జరగనుంది. దుబాయ్‌ స్పోర్ట్స్ కౌన్సిల్‌తో కలిసి నిర్వహించే ఈ ఎడిషన్‌ టెక్‌ మహింద్ర, ఫైడ్‌ జాయింట్‌ వెంచర్‌. ఈ లీగ్‌లో పాల్గొనే ఆటగాళ్ల వివరాలను మంగళవారం వెల్లడించారు. ఇందులో ప్రపంచ చెస్‌ చాంపియన్‌ డింగ్‌ లిరెన్‌, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌, భారత స్టార్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌, మహిళల చాంపియన్‌ హౌ యిఫాన్‌ వంటి ప్రముఖులున్నారు.

ప్రపంచ టాప్‌ ర్యాంక్‌ చెస్‌ ప్లేయర్‌ అయిన కార్ల్‌సన్‌ లీగ్‌తో తన అనుబంధం మాట్లాడుతూ, గ్లోబల్‌ చెస్‌ లీగ్‌ మునుపెన్నడూ లేని విధంగా ఓవర్‌ ది బోర్డ్‌ చెస్‌లో గొప్ప ఈవెంట్‌ అవుతుంది. ప్రత్యేకమైన మిక్స్‌డ్‌ ఫార్మాట్‌లో బాగమైనందుకు సంతోషిస్తున్నాను. భారత ఆటగాళ్లతో పోటీపడేందుకు, లీగ్‌ జట్టు స్ఫూర్తిని ఆస్వాదించేందుకు ఎదురు చూస్తున్నాను అని చెప్పుకొచ్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement