Friday, April 19, 2024

రూ.99కే ‘మేమ్ ఫేమ‌స్’ మూవీ టికెట్..

ఈ వారం థియేట‌ర్ లో రిలీజ్ య్యేందుకు రెడీగా ఉంది మేమ్ ఫేమస్ మూవీ. చిన్న సినిమానే అయిన రిలీజ్ డేట్ దగ్గ‌ర ప‌డుతుండ‌టంతో వినూత్న ప్రచారానికి తెరలేపింది మూవీ టామ్. దీంతో ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. రెగ్యులర్ ప్రమోషన్లతోపాటు టికెట్ల ధరలను తగ్గించే నిర్ణయం కూడా మేకర్స్ తీసుకోవడం విశేషం. సాధారణంగా పెద్ద సినిమాలు రిలీజైనప్పుడు టికెట్ల ధరలు పెంచుతారు.

ఇక చిన్న బడ్జెట్ సినిమాల టికెట్లను అందుబాటు ధరల్లో ఉంచుతారు. అయితే మేమ్ ఫేమస్ మూవీ కోసం మాత్రం కేవలం రూ.99కే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సినిమా రిలీజైన రోజు కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో మేమ్ ఫేమస్ మూవీని కేవలం రూ.99కే చూడొచ్చు. దీనివల్ల తొలి రోజే థియేటర్లు పూర్తిస్థాయిలో నిండుతాయని మేకర్స్ భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement