Monday, May 6, 2024

ఇంటిలోకి దూసుకెళ్లిన కారు – తృటిలో తప్పిన ప్రాణాపాయం

మరిపెడ వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు.. మరిపెడ మున్సిపల్ పరిధిలోని దేశ్యతండా బాణోత్ లక్ష్మణ్ ఇంటి కొట్టంలోకి దూసుకెళ్లింది.. ఈ క్రమంలో ముందు కట్టేసిన ఆవు అక్కడికక్కడే మృతి చెందింది.. అదృష్ట వశాత్తు కారు ఇంట్లోకి కాకుండా కొట్టంలోకి దూసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది.. హైదరాబాద్ కి చెందిన చావ రవి కారు యజమనిగా తెలుస్తోంది.. అతివేగం, నిద్రమత్తు ప్రమాదానికి కారణమని సమాచారం. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement