Sunday, February 25, 2024

అత్తింటి వేధింపులతో గర్భిణీ స్త్రీ ఆత్మహత్య – కేసు నమోదు

మహబూబాబాద్, రూరల్ : నిండు నూరేళ్ళు కలిసి జీవిస్తానని వేదమంత్రాల సాక్షిగా తాళి కట్టిన భర్త, సొంత తల్లిదండ్రులా చూసుకోవాల్సిన అత్తమామల వేధింపులకు 7 నెలల గర్భిణీ మహిళా వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబాబాద్ మండలంలో చోటు చేసుకుంది.కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు మండలం పడమటిగడ్డ తండా కు చెందిన ‌దివ్యను గత సంవత్సరం క్రితం‌ మహ-బాద్ మండలం పర్వతగిరి గ్రామ శివారు భూర్ కుంట తండాకు చెందిన భూక్యా దిలీప్ తో వివాహం జరిగింది. వీరిద్దరికీ వివాహం జరిగి 11 నెలల వ్యవధిలోనే దివ్య ఆత్మహత్య చేసుకోవడంతో, దివ్య ఆత్మహత్య చేసుకోవడం కారణం భర్త, అత్త మామలే కారణమని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement