Friday, April 26, 2024

కెఫిన్‌ టెక్నాలజీ ఐపీఓ.. రూ.2,400 కోట్ల సమీకరణ

దేశీయ స్టాక్‌మార్కెట్‌లో మళ్లి ఐపీఓల సందడి ప్రారంభమైంది. ఉక్రెయిన్‌ర్ఖష్యా మధ్య నెలకొన్న పరిస్థితులు కొద్దిగా అదుపులోకి వస్తుండటంతో.. మళ్లి కొత్త కంపెనీలు ఐపీఓలుగా మార్కెట్లోకి వచ్చేందుకు సెబీ వద్ద క్యూ కడుతున్నాయి. తాజాగా సుప్రసిద్ధ, సాంకేతిక ఆధారిత సేవలు అందించే కెఫిన్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ ఐపీఓగా వచ్చేందుకు సిద్ధమైంది. క్యాపిటల్‌ మార్కెట్‌ వ్యవస్థకు అవసరమైన సేవలు అందించే ఈ సంస్థ.. రూ.2400 కోట్లను తమ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ కోసం డీఆర్‌హెచ్‌పీని సెబీ వద్ద సమర్పించింది. ఈ ఐపీఓను పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ ఎస్‌) రూపంలో విడుదల చేసేందుకు నిర్ణయించింది. జనరల్‌ అట్లాంటిక్‌ సింగపూర్‌ ఫండ్‌ పీటీఈ లిమిటెడ్‌కు చెందిన రూ.2,400 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. భారతీయ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలకు అతిపెద్ద ఇన్వెస్టర్‌ సొల్యూషన్స్‌ సంస్థగా కెఫిన్‌ టెక్నాలజీ నిలిచింది. భారతదేశంలోని 42 ఏఎంసీలలో 25 ఏఎంసీలకు ఈ సంస్థ సేవలు అందిస్తున్నది.

దీంతో పాటుగా.. ఏఎంసీ ఖాతాదారుల సంఖ్యపరంగా 60శాతం మార్కెట్‌ వాటా కలిగి ఉంది. ఈ సంస్థ త్వరలో కార్యకలాపాలు ప్రారంభించనున్న రెండు ఏంఎసీలతో ఇప్పటికే కీలక ఒప్పందం చేసుకుంది. కెఫిన్‌ టెక్నాలజీస్‌లో అధిక వాటాలను జనరల్‌ అట్లాంటిక్‌ నిర్వహిస్తున్నది. అంతర్జాతీయంగా సుప్రసిద్ధమైన ఈ ఈక్విటీ ఇన్వెస్టర్‌కు 74.94 శాతం వాటా ఉంటే.. కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ లిమిటెడ్‌కు 9.98 శాతం వాటా కెఫిన్‌ టెక్నాలజీస్‌కు ఉంది. ఈ ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌, కొటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీ లిమిటెడ్‌, జేపీ మోర్గాన్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌, ఐఐఎఫ్‌ ఎల్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌, జెఫ్రీస్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ వ్యవహరిస్తున్నాయి. ఈ ఈక్విటీ షేర్ల ముఖ విలువ 10 రూపాయలు కాగా.. బీఎస్‌ ఈ, ఎన్‌ ఎస్‌ఈలో లిస్టు చేయడానికి ప్రతిపాదించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement