Thursday, May 2, 2024

AP | చీటీ పేరుతో బురిడీ.. విశాఖలో ఘటన

విశాఖ క్రైం, మధురవాడ : ప్రభ న్యూస్ వందలాది బాధితుల నుండి చిట్టీల పేరుతో కోటి రూపాయలకు మేర వసూలు చేసి పరారైన వ్కక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. చడి చప్పుడు లేకుండా ఉన్న ఇంటి నుంచి కుటుంబంతో సహా పరారయ్యాడని బాధితులు ఆరోపించారు. అతని నుంచి తమ సొమ్మును వసూలు చేసి తమకు అప్పగించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. నమ్మించి శఠగోపం పెట్టాడని ఆవేదన చెందారు. ఈ మేరకు బాధితులు అందరూ పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి, తమ వద్ద చిట్టీలు పేరుతో ఎంత వసూలు చేశారన్నది బాధితులు పోలీసులకు తెలియజేశారు. మధురవాడ వాంబే కాలనీకి చెందిన బచ్చల మురళి కొన్నేలాగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు.

వరలక్ష్మి చిట్టీలు, సంక్రాంతి చిట్టీలు పేరుతో వందలాది మంది నుంచి సుమారు కోటి రూపాయల మీద వసూలు చేశాడు.చెప్పిన సమయానికి అందరికీ డబ్బు ఇస్తానని నమ్మబలికి చడి చెప్పుడు కాకుండా ఉన్న ఇంటి నుంచి కుటుంబంతో సహా పరారయ్యాడు. ఇంటి వద్ద అతని కుటుంబం కనిపించకపోయేసరికి అతని వద్ద చిట్టీలు వేసిన వారు కంగారు పడ్డారు. దీంతో అతనికి ఫోన్ చేయగా అతని ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మరింత ఆందోళన చెందారు. అతని వద్ద చిట్టీలు వేసిన వారందరికీ ఈ విషయం తెలియడంతో చాలామంది అతనికి కంటిన్యూగా ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఫోన్ ఆఫ్ అనే సమాధానం వస్తుంది. దీంతో కంగారుపడిన బాధితులు ఆ ఇంటి చుట్టుపక్కల వారిని వాకబు చేశారు.

కుటుంబంతో కలిసి ఊరు వెళ్తున్నట్లు చెప్పారని సోమవారం ఊరు నుంచి తిరిగి వస్తామని చెప్పారని చుట్టుపక్కల వారు తెలియజేశారు. తర్వాత సోమవారం కూడా బాధితులు బచ్చల మురళి కోసం ఆరా తీశారు.అతను ఊరు నుంచి తిరిగి వచ్చాడ లేదా అని అతని ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం తాళం వేసి ఉంది. దీంతో బాధితులు మరింతగా కంగారుపడ్డారు. అయితే బాధితుల విచారణలో బచ్చల మురళి తన ఉంటున్న ఇంటిని వేరే వాళ్లకు విక్రయించి అక్కడ నుంచి కుటుంబంతో వెళ్లిపోయినట్లు తెలిసింది. దీంతో బాధితులు లబోదిబోమన్నారు.

- Advertisement -

తాము మోసపోయామని గుర్తించారు. వెంటనే బాధితులు అందరూ కలిసి వెళ్లి పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధురవాడ వాంబే కాలనీకి చెందిన బచ్చల మురళి అనే వ్యక్తి చిట్టీల పేరుతో తమను మోసం చేశాడని, కోటి రూపాయల మేర వసూలు చేసి కుటుంబంతో పరారయ్యాడని, అతని వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి తమకు అప్పగించాలని బాధితులు ఫిర్యాదులో విన్నవించుకున్నారు. పీఎం పాలెం సిఐ రామకృష్ణ కేసు నమోదు చేసి నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement