Sunday, April 28, 2024

నవంబర్‌లో బడ్జెట్‌పై పున:సమీక్ష..? రాబడులు, వ్యయాలపై ఫోకస్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వార్షిక ఏడాది 7 నెలల ముగింపుకు చేరడంతో రాష్ట్ర రాబడులు, అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలో సమీక్షించనుంది. రాష్ట్ర ప్రభుత్వ బహిరంగ మార్కెట్‌ రుణాలపై, కార్పొరేషన్ల అప్పులపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణల నేపథ్యంలో ఆర్ధిక వ్యవస్థ ఇబ్బందులకు గురవుతోంది. రాష్ట్ర బడ్జెట్‌లో నిర్దేశించుకున్న లక్ష్యాల్లో కోతలు ఎదురవుతున్నాయి. ఫలితంగా ప్రత్యామ్నాయాలను సిద్దం చేసుకోవాల్సిన ప్రమాదకర పరిస్థితులు ప్రభుత్వానికి తప్పడంలేదు. ఈ నేపథ్యంలో ఒకవైపు కేంద్రం తాను విధించిన అప్పుల పరిమితిని పెంచడమా ? వద్దా ? అనే కోణంలో వ్యయ విభాగం సమీక్షించి నిర్ణయం తీసుకుంటుందని ఆశించినప్పటికీ అది జరగలేదు. ఈ సమీక్షతో రాష్ట్ర అప్పులపై నియంత్రణలు, ఆంక్షలు తొలగిపోతాయని రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకొంది. అయచితే అవేవీ నెరవేరలేదు. ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ చివరకు ఆరు నెలల కాలానిని అర్ధ ఏడాది ముగియగానే ఈ దిశగా కేంద్రం సిఫార్సులు చేస్కతుందని భావించిన ప్రభుత్వానికి నిరాశే ఎదురైంది. ఇక ఇప్పుడు 7 నెలల కాలం ముగింయనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన త్వరలో రాష్ట్ర రాబడులు, వ్యయాలు, అదనపు రాబడుల సమీకరణ, అప్పులపై ఆంక్షలు వంటి కీలక అంశాలపై సమీక్షించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసింది.

బడ్జెట్‌లో రూ.53,970కోట్ల అప్పులను నిర్దేవించుకున్న ప్రభుత్వంపై కేంద్ర నిర్ణయంతో కోతలు పడిన సంగతి తెలిసిందే. ఆయా అంశాలపై ఇంకా ప్రతిష్టంభన తొలగిపోలేదు. గత వారం సీఎం కేసీఆర్‌ ఢిల్లి పర్యటనలో కేంద్రం విధించిన షరతులు, ఆంక్షలపై సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో ఏర్పడిన వైరం కారణంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తులను పెద్దగా కేంద్ర మంత్రులు, అధికారులు పట్టించుకోవడంలేదు. నిర్దేశిత రూ. 53వేల కోట్లే కాకుండా ప్రాజెక్టులకు కార్పొరేషన్ల ద్వారా రూ. 34,873కోట్లు రుణ సమీకరణకు ఇప్పుడు విఘాతం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు పుట్టకపోవడంతోపాటు, రాబడులు మందగించడం ఆర్ధిక పరిస్థితికి ప్రతికూలంగా మారింది. ఈ నేపథ్యంలో ఆర్ధిక శాఖ కష్టాలను ఎదుర్కొంటోంది. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలకు నిధుల లేమి లేకుండా సర్దుబాట్లు చేస్తున్న ప్రభుత్వానికి వచ్చే 5 నెలలు మరింత కీలకం కానున్నాయి. దళితబంధు రెండో దశకు రూ. 17,700కోట్లు, సొంత జాగా ఉన్న వారికి రూ. 3లక్షల ఆర్ధిక సాయం స్వంత ఇంటి నిర్మాణ పథకంతోపాటు, రూ. 50వేల వరకు వ్యవసాయ రుణాల మాఫీ వంటివాటిపై ఈ ప్రభావం పడుతోంది. ఇవేవీ పట్టని విపక్షాలు పథకాలు జాప్యమవుతున్నాయని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి.

- Advertisement -

ఆర్ధికంగా ఎంతటి విపత్కర పరిస్థితి ఎదురైనా ఇప్పటివరకు ధీటుగా అధిగమిస్తూ వచ్చిన ప్రభుత్వానికి కేంద్ర నియంత్రణలు తీవ్ర శాపంగా మారాయి. ఈ నేపథ్యంలో గత రెండు నెలలుగా ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించి నిధులను సమన్వయం చేసుకుంది. హోఓచ్‌ఎండీఏ, రాజీవ్‌ స్వగృహ ప్లాట్లు, ఇండ్లు. భూములుఏ అమ్మడం వంటివి మయొదలు పెట్టింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలకు అనివార్యంగా జాప్యం ఎదురవుతున్నది. రైతు రుణమాఫీ, ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధి, సీపీఎస్‌కు బదులుగా ఓపీఎస్‌ అమలు వంటి అనేక సంక్షేమ్‌ కార్యాక్రమాలు అమలు చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి నిధుల లేమి సమస్యగా మారింది. కేంద్ర ప్రభుత్వంనుంచి రావాల్సిన గ్రాంట్లలో కోతలు, సెస్సుల పేరుతో ఎగవేతలు, జీఎస్టీ బకాయిలు, పెండింగ్‌ బకాయిలను విడుదల చేయడంలో కేంద్ర వైఖరి కారణంగా రాష్ట్ర ఖజానాకు తీరని నష్టం కల్గుతోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ అంచనాలు గతి తప్పుతున్నాయి. ఇలా రకరకాలుగా బడ్జెట్‌లో నిర్దేశించుకున్న రాబడులు, ఆదాయాలపై రూ. 50వేల కోట్లు లోటు ఏర్పడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వీటిని సర్దుబాటు చేసుకోవడం, ప్రత్యామ్నాయాలపై త్వరలో సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకోనుందని తెలిసింది. పథకాల అమలులో ఎటువంటి జాప్యం, నిధుల లేమి లేకుండా ముందుకు వెళ్లేందుకు కావాల్సిన ప్రణాళికను సిద్దం చేసుకునే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఇందుకుగానూ శాఖల వారీగా ఇప్పటి వరకు నిధుల వ్యయం, ఇంకా పెండింగ్‌లు, పథకాల వారీగా కావాల్సిన మొత్తాలు, ఈ ఆర్ధిక ఏడాది చివరకు ఇంకా ఎంత మొత్తం తప్పనిసరి పథకాలు, వ్యయాలు ఖర్చులు ఉన్నాయనే కోణంలో సమగ్రంగా చర్చించి కీలక నిర్ణయాలకు ఈ సమీక్షా సమావేశం వేదిక కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement